అన్వేషించండి

Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!

ఇన్‌స్టాగ్రామ్‌లో బొమ్మ తుపాకులతో రీల్స్ చేస్తూ పాక్ ఐఎస్ఐ ముఠా వలలో పడి, ఆయుధాల కోసం ప్రయత్నిస్తున్న యూపీ యువకుడు జయీద్‌ఖాన్‌ను మేడ్చల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐఎస్ఐ మద్దతున్న ముఠాతో సంప్రదింపులు, యువకుడు అరెస్ట్.
  • సోషల్ మీడియాలో బొమ్మ తుపాకులతో వీడియోలు పోస్ట్ చేశాడు.
  • పాక్ ఐఎస్ఐ సభ్యులు లైక్‌లు, కామెంట్స్‌తో మభ్యపెట్టారు.
  • రెండు నకిలీ తుపాకులు, ఫోన్‌ స్వాధీనం, రిమాండ్‌ విధించారు.

మేడ్చల్: పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతున్న ఒక ముఠాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న జయీద్‌ఖాన్‌ అనే 22 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.  మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్‌, ఈ ఏడాది ఫిబ్రవరిలో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఇక్కడ మేడ్చల్‌లోని ముబారక్‌ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిలో చేరాడు. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా పిచ్చితో రీల్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే రెండు బొమ్మ తుపాకులతో (Toy Pistols) అతడు చేసిన వీడియోలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రియాక్షన్ రావడంతో, అలాంటి వీడియోలను మరిన్ని చేసి అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.

అయితే, సామాజిక మాధ్యమాల్లో జయీద్‌ఖాన్‌ పోస్ట్ చేసిన ఈ వీడియోలను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సానుభూతిపరులు హబీబ్, రాణాహుస్సేన్‌లు గమనించారు. పాక్ ఐఎస్‌ఐ కీలక సభ్యుడైన షహబాద్‌తో నేరుగా సంబంధాలున్న ఈ ఇద్దరు.. జయీద్‌ఖాన్‌ వీడియోలకు లైక్‌లు కొడుతూ, కామెంట్స్ పెడుతూ మెల్లగా అతనికి దగ్గరయ్యారు. అనంతరం షహబాద్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జయీద్‌ఖాన్‌తో చాటింగ్ మొదలుపెట్టారు. మాటలతో అతడిని రెచ్చగొడుతూ.. తాము చెప్పినట్లు వింటే అసలైన తుపాకులు పంపుతామంటూ ఆశ చూపారు. వీరి మాటలకు ఆకర్షితుడైన జయీద్, చాటింగ్‌లో నాకు అవకాశం ఇస్తే పాకిస్థాన్‌ కూడా వస్తానని వారితో అన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సోషల్ మీడియాలో జయీద్‌ఖాన్‌ పెడుతున్న రీల్స్, అతని అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచిన కేంద్ర రక్షణ సంస్థలు మేడ్చల్‌ పోలీసులను అప్రమత్తం చేశాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని గదిలో ఉన్న 2 నకిలీ తుపాకులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను పరిశీలించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి పాక్ ఐఎస్‌ఐ ముఠా సభ్యులతో జరిపిన వాట్సాప్‌ చాటింగ్, వాయిస్‌కాల్స్, స్క్రీన్‌షాట్‌లు గుర్తించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు (FSL) పంపారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో, పోలీసులు జయీద్ ఖాన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అతడికి పాక్ ఐఎస్ఐతో ఉన్న లింకులు, ఇంకా ఏదైనా ఉగ్రసంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడా.. వారు చెప్పిన పనులు ఏమైనా చేశాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో పాకిస్థాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఎవరు అరెస్ట్ అయ్యారు?

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల జయీద్ ఖాన్ అనే యువకుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతను పాకిస్థాన్ నిఘా సంస్థ ISI మద్దతున్న ముఠాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడు.

జయీద్ ఖాన్ ISI ముఠాతో ఎలా సంబంధంలోకి వచ్చాడు?

జయీద్ ఖాన్ సోషల్ మీడియాలో బొమ్మ తుపాకులతో చేసిన వీడియోలకు వచ్చిన స్పందనను గమనించిన పాక్ ISI సభ్యులు, అతనితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం అతనితో చాటింగ్ ప్రారంభించి, రెచ్చగొట్టి, అసలైన తుపాకులు పంపుతామని ఆశ చూపారు.

జయీద్ ఖాన్ వద్ద నుండి పోలీసులు ఏమి స్వాధీనం చేసుకున్నారు?

పోలీసులు జయీద్ ఖాన్ వద్ద నుండి 2 నకిలీ తుపాకులు, అతని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌లోనే ISI సభ్యులతో జరిపిన చాటింగ్, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు గుర్తించారు.

జయీద్ ఖాన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

జయీద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. అతని ISI లింకులపై విచారణ కొనసాగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget