Crime News: ఇన్‌స్టాలో పరిచయం అయి పెళ్లి అనే సరికి దుబాయ్ నుంచి ఎగిరొచ్చేశాడు - పెళ్లి డ్రస్‌లో కల్యాణమండపానికి వెళ్లే సరికి...
Instagram bride: ఆన్ లైన్ మోసాలు.. ఆఫ్ లైన్ దాకా వస్తే ఎలా ఉంటుందో ఆ పెళ్లి కొడుక్కి అర్థమయ్యే సరికి సిగ్గులతో చితికిపోయి ఉంటాడు. పెళ్లి అయిపోతుదంని దుబాయ్ నుంచి వస్తే పెళ్లి బట్టలతో రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.
Groom from Dubai duped by Instagram bride left waiting with baraat in Moga: పంజాబ్ లోని మోగా అనే ఊళ్ల ఓ పెళ్లి బారాత్ ఘనంగా జరుగుతోంది. పెళ్లి కొడుకును ముస్తాబు చేసి తీసుకు వస్తున్నారు. డాన్సులు వేసే వాళ్లు వేస్తున్నారు.. చిందులేసేవాళ్లు వేస్తున్నారు. అయితే ఆ బారాత్ అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. పెళ్లి కొడుకు గుర్రం మీదనే ఉన్నాడు. కల్యాణమండపం మాత్రం కనిపించలేదు. తెలిసిన వాళ్లను ఫలానా కళ్యాణమండపం ఏది అని అడిగితే అందరూ ఆ పెళ్లి కొడుకువైపు ఆశ్చర్యంగా చూశారు. అక్కడ అలాంటి కళ్యాణ మండపం ఏదీ లేదని చెప్పడంతో ఆ పెళ్లి కొడుక్కి మూర్చవచ్చినంత పని అయింది. పెళ్లి కూతురికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.దాంతో ఆ పెళ్లి కొడుకు.. పెళ్లి బట్టలతో అలా రోడ్డున నిలబడిపోయాడు.
అసలేం జరిగిందంటే.. పంజాబ్ కు చెందిన దీపక్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇన్‌స్టాలో ఓ అమ్మాయి పరిచయం అయింది. చాటింగ్‌లు చేశారు. వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. పెళ్లి చేసేసుకుందాం అని తీర్మానించుకున్నారు. ఆ అమ్మాయి కూడా రెడీ అన్నది. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే చేస్తా.. ముహుర్తం సమయానికి బంధువులతో వస్తే చాలని చెప్పింది. అదే విధంగా దీపక్ తన బంధువులతో కలిసి పెళ్లి సమయానికి దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చి.. అక్కడి నుంచి మోగాకు వచ్చాడు.అక్కడ కూడా ఆ అమ్మాయి లాడ్జిలో రూములు బుక్ చేయించి.. పెట్టింది.
కల్యాణ మండపం అంతా రెడీఅయిందని.. తాము పెళ్లికి రెడీగా ఉంటామని .. బారాత్ చేసుకుంటూ వచ్చేయమని చెప్పింది. ఆహానా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట అతను కూడా వచ్చాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. దీపక్ బంధువులు ఓ ప దిహేను మంది ఉంటే.. మిగతా నూటయాభై మందిని కూడా ఆ అమ్మాయే సమకూర్చింది. ఆమె ఎవరో వారికీ తెలియదు. బారాత్ కోసం వెళ్లమంటే వెళ్లామని వారంటున్నారు. బారాత్ వేడుకలను హుషారుగా చేసుకుంటూ పెళ్లి మండపం దగ్గరకు వచ్చే సరికి అసలు విషయం తేలిపోయింది.
Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !
దీంతో అందరూ దీపక్ ను జాలిగా చూడటం ప్రారంభించారు. అమ్మాయిని నేరుగా చూడకుండా.. .కలవకుండా.. వీడియో కాల్స్ తోనే అంతా అయిపోయిందని పెళ్లికి రెడీఅయిపోయి రావడం ఏంటి బాసూ అని అందరూ ప్రశ్నిస్తూంటే దీపక్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలో లేదో కూడా తెలియక అలా ఉండిపోయాడు. ఆన్ లైన్ లో ప్రారంభమైన ఆఫ్ లైన్‌లో మోసం కొనసాగితే ఎలా ఉంటుందో పాపం దీపక్ కు అర్థమైపోయి ఉంటుంది. ఇంకో సారి పెళ్లి అనే మాట ఎత్తితే షాక్ గురయ్యేంత ఎక్స్ పీరియన్స్ మరి !