అన్వేషించండి

Crime News: పండుగ నాడు దివ్యాంగురాలిపై అఘాయిత్యం, తెల్లవారేసరికి శవమై కనిపించిన నిందితుడు

Andhra Pradesh News | శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వినాయక చవితి పండుగ రోజు దివ్యాంగురాలిపై మాజీ వాలంటీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తెల్లవారేసరికి నిందితుడు చనిపోయాడు.

Girl molested In Sri Sathya Sai District | పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం కొత్తమిట్ట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెవిటి మూగ అయిన ఒక దివ్యాంగురాలిపై ఒక ఉన్మాది అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. అయితే తనపై అత్యాచారం కేసు నమోదు కావడంతో, అరెస్ట్ చేస్తారన్న భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారగుండ్ల గ్రామానికి చెందిన జనార్ధన్ అనే వ్యక్తి గతంలో వాలంటీర్ గా పనిచేశాడు. దివ్యాంగురాలికి పింఛన్ పంపిణీ చేసే క్రమంలో తరచు కొత్తమిద్దె గ్రామానికి వెళ్లేవాడు. ఆ సమయంలోనే ఆ దివ్యాంగురాలిని తప్పుడు దృష్టితో చూసేవాడు. వినాయక చవితి సందర్భంగా కొత్తపేట గ్రామంలో వినాయకుని మండపంలో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే అదునుగా భావించిన నిందితుడు జనార్ధన్ అర్ధరాత్రి దివ్యాంగురాలిని పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. యువతి అడ్డుకునే ప్రయత్నం చేసినా, ప్రతిఘటించినా ఆ కామాంధుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇది గమనించిన చిన్న పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న దివ్యాంగురాలి తండ్రి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్ధరాత్రి సమయంలోనే గాలింపు చర్యలు చేపట్టిన నిందితుడు జాడ కనుగొనలేకపోయారు. 

 ఉదయాన్నే శవమై కనిపించిన నిందితుడు

దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు జనార్దన్ ఉదయాన్నే సారగొండపల్లి గ్రామంలో శవమై కనిపించడం కలకలం రేపుతోంది.  నిందితుని తల్లి ఫిర్యాదు మేరకు తన కొడుకు సారగొండ్లపల్లి గ్రామంలోని ఒక కన్ స్ట్రక్షన్ బిల్డింగులో ఉరివేసుకొని చనిపోయినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. నిందితుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడే ఒక సూసైడ్ నోటును గుర్తించారు. అందులో నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసి ఉన్నట్లు గుర్తించారు. సూసైడ్ లెటర్లో తన సంతకంతో పాటు వేలిముద్రను కూడా నిందితుడు వేసినట్లు పోలీసులు గుర్తించారు. వేలిముద్ర ఆధారంగా యువతిపై అతడే అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు భావించారు. కానీ అరెస్ట్ భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: శ్రీకాకుళంలో గంజాయి డెన్ లపై నిఘా, 9 మంది అరెస్ట్ - కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget