Hyderabad News: హయత్‌నగర్‌లో తీవ్ర విషాదం - స్కూల్ గేట్ మీద పడి విద్యార్థి మృతి
Crime News: పాఠశాల గేట్ మీద పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First Class Student Died After School Gate Fell On Him: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో (Hayat Nagar) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం సాయంత్రం పాఠశాల గేట్ మీద పడి ఒకటో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 4 గంటల సమయంలో స్కూల్ ప్రధాన గేటుతో బాలుడు ఆడుకుంటుండగా.. అదే సమయంలో మరికొందరు చిన్నారులు గేట్ ఎక్కి అటూ ఇటూ ఊగుతున్నారు. ఈ క్రమంలో గేట్ వెల్డింగ్ జాయింట్లు ఊడిపోయి మీద పడడంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడు స్థానిక ముదిరాజ్ కాలనీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Asifabad News: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎందుకంటే!