Delhi News: మాంజా ఎంత పని చేసింది, మెడకు చుట్టుకుని దిల్లీలో బైకర్ మృతి
Delhi News: దిల్లీలో ఓ బైకర్ వేగంగా వెళ్తుండగా, మాంజా దారం మెడకు చుట్టుకుని మృతి చెందాడు.
మెడకు చుట్టుకున్న దారం..
పతంగులు ఎగరేయటం అందరికీ సరదానే. కానీ ఈ సరదా విషాదంగా ముగిసిన సందర్భాలెన్నో ఉన్నాయి. కైట్స్ ఎగరేస్తూ బిల్డింగ్‌ల నుంచి చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్ర గాయాల పాలై జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం అవాల్సిన దుస్థితినీ ఎదుర్కొన్నారు. పతంగులు ఎగరేయటానికి వినియోగించే మాంజా దారమూ ప్రాణాలు తీసింది. ఈ దారం వాడకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవటం లేదు. ఒక్కోసారి ఇది చెట్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు, కరెంట్ పోల్స్‌కు చిక్కుకుని గాలికి కింద పడిపోతుంటాయి. ఇవే ప్రమాదం కొని తెస్తుంటాయి. దిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. వాయువ్య దిల్లీలోని మౌర్య ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, దారం చుట్టుకుని మృతి చెందాడు. హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న సుమిత్ రంగ మెడకు పతంగి ఎగరేసే దారం గట్టిగా చుట్టుకుంది. గొంతు పూర్తిగా కోసుకుపోయింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు మృతి చెందాడు. బురారీ నుంచి వెళ్తుండగా, ఓ దారం వచ్చి తన కొడుకు మెడకు గట్టిగా చుట్టుకుందని, అందుకే మృతి చెందాడని మృతుడి తండ్రి చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కత్తిలా మారి గొంతులు కోస్తోంది..
గాలిపటాలు- పతంగ్‌లు-, వాటిని ఎగుర వేయడానికి అవసరమైన చైనా దారం మాంజా వెల్లువలా దిగుమతి అవుతూ ఉంటుంది. చైనా నుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను పావురాల గొంతులను కోస్తోందని 2013నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని తేలింది. చైనా మాంజా దారంతో గాలిపటాలు బాగా ఎగురవేయవచ్చన్న ఉద్దేశంతో జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా దారంలో గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలుపుతున్నారు! అందువల్ల ఈ దారం కత్తిలాగా మారుతోంది.
As the season of flying kites begins in Delhi, 1st death due to a cut in the neck by a sharp kite-string has been reported.
— Pankaj पत्रकार Yadav (@pkjscribe) July 26, 2022
Incident happened at Haiderpur Flyover in North Delhi when the victim was going on his motorcycle. Case registered at Maurya Enclave P.S.@DelhiPolice
Also Read: Monkeypox Rename: మంకీపాక్స్ పేరు మార్చండి, WHOకి విజ్ఞప్తి చేసిన ఆ సిటీ-కారణమేంటంటే?
Also Read: Delhi Police: దొంగల్ని ఇలా గుర్తించండి, దిల్లీ పోలీసులు చెప్పిన పాఠం విన్నారా?