అన్వేషించండి

ప్రియుడి కోసం కన్న బిడ్డని చంపుకున్న తల్లి, దృశ్యం సినిమా చూసి డెడ్‌బాడీ దాచేసింది

Gujarat Crime: గుజరాత్‌లో ఓ మహిళ ప్రియుడి కోసం కన్న బిడ్డను చంపుకుంది.

Gujarat Crime: 

గుజరాత్‌లో దారుణం..

గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఓ మహిళ కన్న కొడుకునే కసిదీరా చంపేసింది. రెండున్నరేళ్ల బిడ్డని హత్య చేసింది. మళ్లీ ఏమీ తెలియనట్టు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి తన బాబు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చింది. దాదాపు మూడు రోజుల పాటు చాలా చోట్ల వెతికారు పోలీసులు. పోలీస్‌లతో పాటు ఆ మహిళ కూడా వెతికింది. కానీ ఎక్కడా ఆ బిడ్డ దొరకలేదు. ఆ తరవాత అనుమానం వచ్చి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ చిన్నారి తల్లిని ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. బిడ్డని తానే చంపినట్టు అంగీకరించింది ఆ తల్లి. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో కూలీగా పని చేస్తోంది నిందితురాలు నయన మండవి. ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని చేస్తున్నానని, అక్కడే బాబుని వదిలి పనికి వెళ్లినట్టు పోలీసులకు చెప్పింది. ఆ తరవాత ఎంత వెతికినా కనిపించలేదని ఫిర్యాదు చేసింది. అయితే...ఆ సైట్‌ దగ్గరున్న CCTVని పరిశీలించారు పోలీసులు. ఆ సైట్ వదిలి పిల్లాడు ఎక్కడికీ వెళ్లలేదని కన్‌ఫమ్ చేసుకున్నారు. అప్పుడే డౌట్ వచ్చి తల్లిని గట్టిగా ప్రశ్నించారు. కానీ...సరైన సమాధానాలు చెప్పలేదు. డాగ్‌ స్క్వాడ్‌ని రంగంలోకి దింపినా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఆ తరవాత మరో కథ చెప్పింది ఆ మహిళ. తన ప్రియుడే కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడని బుకాయించింది. ఆ వ్యక్తి కోసం ఆరా తీసినా...ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. 

డ్రామాలు..

ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు పదేపదే ఆమె తల్లిని ప్రశ్నించారు. అప్పటికి కానీ ఆమె నిజం చెప్పలేదు. తన చేతుల్తో తానే హత్య చేశానని అంగీకరించింది. అయితే..డెడ్‌బాడీ ఎక్కడుందో చెప్పమని అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చింది. ఓ చిన్న గుంతలో పాతి పెట్టానని చెప్పింది. అక్కడ తవ్వితే ఎలాంటి మృతదేహం దొరకలేదు. మరో చోట ఉందని పరుగులు పెట్టించింది. అక్కడా దొరకలేదు. చివరకు తాను పని చేసే సైట్‌లోనే టాయిలెట్‌లో పాతి పెట్టినట్టు అంగీకరించింది. అక్కడే చిన్నారి మృతదేహం దొరికింది. ఎందుకు చంపావ్ అని ప్రశ్నించగా...మొత్తం కథంతా చెప్పింది. 

"మాది ఝార్ఖండ్. అక్కడే ఓ వ్యక్తిని ప్రేమించాను. అతనితో కలిసి బతకాలనుకున్నాను. కానీ నా బిడ్డతో వస్తే ఇంటికి రానివ్వని కండీషన్ పెట్టాడు. అందుకే ఏం చేయాలో తెలియక నా బిడ్డను చంపుకున్నాను"

- నిందితురాలు 

దృశ్యం సినిమా చూసి..

హత్య చేసిన తరవాత డెడ్‌బాడీని ఎలా దాచాలో అర్థం కాలేదు. దృశ్యం సినిమా చూసి అదే సీన్‌ని రిపీట్ చేసింది. ఆ సినిమాలో ఓ డెడ్‌బాడీని దాచేసి, ఆధారాలేమీ దొరక్కుండా చాలా జాగ్రత్త పడతాడు. పోలీసులను ముప్పతిప్పలు పెడతాడు. చివర్లో డెడ్‌బాడీ ఎక్కడుందో రివీల్ చేస్తారు. రియల్‌ లైఫ్‌లోనూ ఇది సాధ్యమే అనుకుని ఫిక్స్ అయిపోయిన ఆ మహిళ..అదే ప్లాన్‌ని ఫాలో అయింది. అలా చేస్తే పోలీసులకు దొరికిపోనని అనుకుంది. కానీ..చివరకు కథంతా అడ్డం తిరిగింది. 

Also Read: 8 నెలలుగా లోదుస్తులు మాయం, పక్కాప్లాన్‌తో దొంగని పట్టుకున్న మహిళ - చితకబాదిన స్థానికులు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget