అన్వేషించండి

8 నెలలుగా లోదుస్తులు మాయం, పక్కాప్లాన్‌తో దొంగని పట్టుకున్న మహిళ - చితకబాదిన స్థానికులు

Clash Over Innerwear: ఓ మహిళ లోదుస్తుల్ని యువకుడి కాజేయడంపై రెండు గ్రూపులు గొడవ పడ్డాయి.

Clash Over Innerwear: 

అహ్మదాబాద్‌లో ఘటన..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వింత గొడవ జరిగింది. కారణం చెబితే మనకి సిల్లీగానే అనిపించినా స్థానికంగా ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఓ అండర్ వేర్ విషయంలో రెండు గ్రూప్‌లు కొట్టుకున్నాయి. ఈ కొట్లాటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది అరెస్ట్ అయ్యారు. జూన్ 27న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంతకీ గొడవేంటంటే...ఓ మహిళ లోదుస్తుల్ని ఓ యువకుడు దొంగిలించాడు. ఒకసారి రెండుసార్లు కాదు. దాదాపు 8 నెలలుగా ఇదే పని చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. బయట ఆరేసిన ప్రతిసారీ అవి మాయం అవుతున్నాయని గుర్తించిన ఆ మహిళ అసహనానికి గురైంది. చివరకు ఓ ప్లాన్ చేసి ఆ నిందితుడుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ మొబైల్‌ని అక్కడ పెట్టి కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ ఆప్షన్ పెట్టి వెళ్లిపోయింది. ఆ తరవాత ఫుటేజ్‌ని గమనించి షాక్ అయింది. పొరుగింటి వ్యక్తే తన లోదుస్తుల్ని కాజేస్తున్నాడని గుర్తించింది. ఆ తరవాత మాటు వేసి మరీ దొంగిలించే సమయంలో పట్టుకుంది. గొడవకు దిగింది. అప్పుడే ఆ యువకుడు ఆమెపై దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఇంటికి వెళ్లి విషయమంతా చెప్పడం వల్ల కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. కర్రలు పట్టుకుని ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడితో పాటు కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. ఆ తరవాత అటు నుంచి కూడా దాడి మొదలైంది. ఇలా చాలా సేపు రెండు గ్రూప్‌లు కొట్టుకున్నాయి. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కి వచ్చారు. అప్పటికే 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

"మహిళ తరపున బంధువులపై FIR నమోదు చేశాం. ఆ నిందితుడినీ అదుపులోకి తీసుకుని కేసు పెట్టాం. మహిళను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసుకుంటాం. ఈ కొట్లాటలో దాదాపు 10 మంది గాయపడ్డారు. మొత్తం 20 మందిని అరెస్ట్ చేశాం"

- పోలీసులు 
 
Also Read: మూడో బిడ్డని కంటే సర్కార్ నౌకరీకి ఛాన్స్ లేనట్టే, పార్లమెంట్‌లో బిల్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget