US Indian shot: మొన్న తల నరికాడు - ఇవాళ తలలో బుల్లెట్లు దింపారు - అమెరికాలో మరో ఇండియన్ హత్య - వీడియో
Gujarat Man in US: అమెరికాలోని ఓ హోటల్ లో భారతీయుడి తల నరికేసిన ఘటన కళ్ల ముందు ఉండగానే మరో హోటల్ మేనేజర్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు. ఈ ఘటన దృశ్యాలు వైరల్ గా మారాయి.

Gujarat origin motel manager was shot dead in US: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గుజరాత్ మూలాలు ఉన్న హోటల్ మేనేజర్ ను ఓ వ్యక్తి కాల్చి చంపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 51 ఏళ్ల రాకేష్ పటేల్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపాడో వ్యక్తి.
గుజరాత్‌లోని సూరత్ జిల్లా, బర్డోలి సమీపంలోని రాయమ్ గ్రామానికి చెందిన రాకేష్, మోటెల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. హోటల్ లో జరిగిన గొడవను సముదాయించడానికి ప్రయత్నించడంతో ఈ దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి మోటెల్ గెస్ట్ గా గుర్తించారు. అతడిని ను అరెస్టు చేశారు.
🚨 Another Indian killed in the US
— The News Drill (@thenewsdrill) October 7, 2025
Rakesh Patel (51) from Gujarat was shot dead outside his motel in Pittsburgh after he went to check on gunshots.
This is the 3rd brutal killing of an Indian in the US in just a month after Dallas motel manager Chandra Mouli’s beheading &… pic.twitter.com/j70wZ9FPg0
ఘటన శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంటకు పిట్స్‌బర్గ్ మోటెల్ పార్కింగ్ లాట్‌లో జరిగింది. క్రిమినల్ కంప్లైంట్, సర్వైలెన్స్ ఫుటేజ్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి పేరు స్టాన్లీ యూజీన్ వెస్ట్, బ్లాక్ సెడాన్ కారులో కూర్చున్న మహిళ ను మొదటగా టార్గెట్ చేశాడు. ఆ మహిళకు గాయాలయ్యాయి. ఆమె కారుతో సహా వేగంగా బయటకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Rakeshbhai Patel of Bardoli taluka of Gujarat shot dead in Pittsburgh, America
— Gujarat Herald News (@GujaratHerald) October 6, 2025
The murderer is clearly visible in the CCTV footage Murders of Gujaratis in America are increasing day by day which is a matter of concern#America @shaktisinhgohil #USA#Gujarat @realDonaldTrump pic.twitter.com/kGS01GhfEo
ఈ సమయంలో మోటెల్ మేనేజర్ రాకేష్ పటేల్, పార్కింగ్ లాట్‌లో గన్‌షాట్ సౌండ్ విని, సహాయం చేయడానికి బయటకు వచ్చాడు. అయితే రాకేష్ వైపు వెస్ట్ మెల్లగా వచ్చాడు. ఆర్ యూ ఆల్‌రైట్ అని రాకేష్ అడుగుతూండగానే రాకేష్ తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చాడు. రాకేష్ స్పాట్‌పైనే మరణించాడు. దాడి తర్వాత వెస్ట్, సమీపంలో పార్క్ చేసిన వ్యాన్‌లోకి వెళ్లి పారిపోయాడు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతను రెండు వారాలుగా హోటల్‌లో ఆ మహిళతో ఉంటున్నాడు. పోలీసులు మహిళ సమాచారం పొందిన వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. వెస్ట్ పారిపోవడంతో అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. రాకేష్ మరణంపై గుజరాత్ మూలాల అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో మోటెల్ బిజినెస్‌లో పనిచేస్తున్న గుజరాతీలు ఎక్కువ మంది ఉంటారు.





















