అన్వేషించండి

Machilipatnam News: తెలుగుదేశం కార్యకర్తపై అర్థరాత్రి దాడి, పేర్ని కిట్టు పనేనని టీడీపీ ఆరోపణ

TDP News: మచిలీపట్నం శివారులోని ఉల్లిపాలెంలో టీడీపీ కార్యకర్త యశ్వంత్‌పై అర్థరాత్రి దాడి జరిగింది. పేర్నికిట్టు పనేనని టీడీపీ మండిపడుతోంది.

Andhra Pradesh News: ఎన్నికలు అంటేనే గొడవలు, కొట్లాటలు, ఉద్రిక్తతలు..ఇక ఢీ అంటే ఢీ అనే నియోజకవర్గాల్లో ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుంటారు. కృష్ణా(Krishna), గుంటూరు(Guntur) జిల్లాల్లో మాత్రం ఎన్నికలు వచ్చాయంటే ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయి. మచిలీపట్నం(Machilipatnam)లో తెలుగుదేశం కార్యకర్త ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. టీడీపీ(TDP) కార్యకర్త యశ్వంత్‌ను తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న యశ్వంత్‌కు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు(Perni Kittu) వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు..

మచిలీపట్నంలో ఉద్రిక్తత
మచిలీపట్నం రూరల్ మండలం ఉల్లిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం(Telugudesam) కార్యకర్త యశ్వంత్ ఇంటిపై కొందరు దుండగులు రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న యశ్వంత్‌ను తీవ్రంగా కొడుతూ కారులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యశ్వంత్(Yaswanth) ఏదైనా తప్పు చేసిన ఉంటే...పోలీసులు వెళ్లి తీసుకురావాలి కానీ రౌడీలువ వెళ్లడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా యశ్వంత్‌ను కొట్టుకుంటూ తీసుకొచ్చిన వారిని పట్టుకుని కేసు పెట్టకుండా ఎలా వదిలేశారని ఆయన మండిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను ఆయన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

కిట్టు అనుచరుల పనే..!
యశ్వంత్‌పై దాడి చేసింది మాజీమంత్రి పేర్నినాని(Perni Nani) కుమారుడు కిట్టు అనుచరులేనని కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెలుగుదేశం(TDP)ఫ్లెక్సీలు కడుతున్నారని కిట్టు అనుచరులు 20 మంది వచ్చి దాడికి పాల్పడ్డారని యశ్వంత్ కుటుంబ సభ్యులు  తెలిపారు. ఇంట్లో ఉన్నవాడిని కారులో ఎక్కించుకుని తిప్పుతూ తీవ్రంగా కొట్టారని తల్లి భోరున విలపించింది. తమకు అసలు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. తమ కుమారుడిని చంపేస్తారేమోనంటూ భయపడుతోంది. దాడికి పాల్పడిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పత్తి పవన్, హేమనాన, చరణ్, పత్తి రామారావు సహా 20 మంది దాడిలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.  దాడి చేసిన వారిపై యశ్వంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుని తీవ్రంగా కొట్టారని... 20 మంది ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చారని యశ్వంత్ తల్లి భయాందోళన వ్యక్తం చేశారు. తాము ఎవరినీ ధూషించడంగానీ, విమర్శించడం గానీ చేయలేదన్నారు. మా పని ఏదో మేం చేసుకుంటాం తప్ప...రాజకీయ గొడవలు అసలు తెలియవన్నారు. అర్థరాత్రి వరకు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక భయపడిపోయామన్నారు. ఖచ్చితంగా తమ కుమారుడిని చంపేస్తారని భావించామన్నారు.

కొల్లు రవీంద్ర ఆగ్రహం
యశ్వంత్‌ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ తీవ్రంగా కొట్టారని...ప్రస్తుతం అతను నడవలేనిస్థితిలో ఉన్నాడని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నా...కొట్టుకుని తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...ప్రజలను భయపెట్టాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు సైతం బాధితులకు రక్షణగా నిలవకుండా అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు.యశ్వంత్ కు ఏం జరిగినా..పేర్నినాని (Perni Nani)ఆయన కుమారుడు కిట్టునే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget