అన్వేషించండి

Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం

Krishna Crime: కృష్ణా జిల్లాలో మరో ఆఫీసర్ వేధింపులతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఉయ్యూరులో జరిగిన ఘటన సంచలనంగా మారుతోంది.

Krishna Crime: ఫైనాన్స్‌ విషయంలో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులతో ఉయ్యూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్తకు చెందిన ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న భార్య తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 

భీమవరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వాణి భర్త కుమార్ వద్ద ఉయ్యూరుకు చెందిన వినాయక్ బాబు ఫైనాన్స్ పద్ధతిలో లారీ కొనుగోలు చేశాడు. ఈ విషయంలోనే వివాదం రేగింది. ఇది ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. లారీ కొనుగోలు సమయంలో అగ్రిమెంట్ రాలేదు. అయితే అగ్రిమెంట్ వస్తుందనే ధీమాతో ఆయన 3 లక్షలు ఖర్చు చేసి లారీకి మరమ్మతులు పూర్తి చేశాడు. అయితే 40 రోజులు అయినా  రాసుకున్న అగ్రిమెంట్ రాలేదు. 

Also Read : ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

40 రోజుల దాటిన కొనుగోలు చేసిన వ్యక్తి వినాయక్ బాబు పేరు మీద లారీని మార్చేందుకు  కుమార్ ముందుకు రాలేదు. ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. చివరకు వివాదం తొలుత భీమవరం పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. కుమార్ భార్య భీమవరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో వివాదంపై ప్రభావితం చూపారని బాధితులు వాపోతున్నారు. భీమవరం పంచాయితీ  తర్వాత మొదట పడమట, ఆ తర్వాత పెనమలూరు పోలీస్ స్టేషన్లో వినయ్‌బాబుపై కుమార్ కేసులు పెట్టారు. 

Also Read : గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన

పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పాటు కేసు విచారణ చేపట్టారు. కుమార్ భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల అండదండలతో వేధింపులకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా కుమార్ భార్య కానిస్టేబుల్ పెనమలూరు పోలీస్ స్టేషన్‌లోనే బాధితులను బెదిరించిందని అంటున్నారు. చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. 

పోలీసు స్టేషన్‌లోనే తమకు న్యాయం జరగడం లేదని వినయ్‌బాబు భార్య మానసిక ఆందోళనకు గురయ్యారు. ఆవేదనతో నేడు ఉయ్యూరులో వినాయక్ బాబు, ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఉయ్యూరులో కాలువలో వినాయక్ బాబు దూకాడు. అతన్ని స్థానికులు కాపాడారు. 

Also Read : హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులతో విసిగిపోయి వినాయక్ బాబు భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఎలుకల మందు తినడంతో హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget