Share Market Opening: ధన్‌తేరస్ రోజున మందకొడిగా మార్కెట్ - రెడ్ జోన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
Stock Markets At Dhanteras: బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల పతనంతో 43,537 స్థాయికి సమీపంలో స్టార్ట్ అయింది.
Share Market Opening on 10 November 2023: ఈ రోజు (శుక్రవారం) ధన్‌తేరస్ పండుగ. ఈ రోజు కొత్త కొనుగోళ్లు చేయడం శుభప్రదమని చాలామంది పెట్టుబడిదార్లు భావిస్తారు. స్టాక్ మార్కెట్‌లోనూ కొత్త కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నా, ట్రేడ్ ఓపెనింగ్‌లో ఆ ఉత్సాహం కనిపించలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఇలా..
నిన్న (గురువారం), 64,832 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 76.09 పాయింట్లు లేదా 0.12 శాతం క్షీణతతో 64,756 వద్ద ఓపెన్ అయింది. నిన్న 19,395 స్థాయి వద్ద ముగిసిన NSE నిఫ్టీ, ఈ రోజు 43.45 పాయింట్లు లేదా 0.22 శాతం తగ్గి 19,351 వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల పతనంతో 43,537 స్థాయికి సమీపంలో స్టార్ట్ అయింది.
సెన్సెక్స్ ప్యాక్ పరిస్థితి
ఓపెనింగ్ ట్రేడ్‌లో... సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 13 మాత్రమే లాభపడగా, 17 స్టాక్స్ క్షీణించాయి. టాప్ సెన్సెక్స్ గెయినర్స్‌లో HDFC లైఫ్ 1.38 శాతం, పవర్‌గ్రిడ్ 1.33 శాతం, అదానీ పోర్ట్స్ 0.80 శాతం, SBI లైఫ్ 0.74 శాతం, ONGC 0.67 శాతం, అదానీ పోర్ట్స్ 0.40 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ షేర్ల చిత్రం
మార్కెట్ ప్రారంభంలో... నిఫ్టీ 50 ప్యాక్‌లోని 13 స్టాక్స్ పెరిగే ధోరణిలో కనిపిస్తే, 37 స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. HDFC లైఫ్ అత్యధికంగా 1.39 శాతం, పవర్ గ్రిడ్ 1.24 శాతం, ONGC 0.65 శాతం, SBI లైఫ్ 0.57 శాతం, టెక్ మహీంద్ర 0.48 శాతం గ్రీన్‌లో ఉన్నాయి.
అడ్వాన్స్ & డిక్లైన్ రేషియో
బిజినెస్ ప్రారంభ సమయంలో.. BSEలో 1067 షేర్లు లాభపడగా, 923 షేర్లు నిన్నటి స్థాయి కంటే తగ్గాయి. 113 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, సెన్సెక్స్ 159.82 పాయింట్లు లేదా 0.25% క్షీణతతో 64,672 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 35.45 పాయింట్లు లేదా 0.18% తగ్గి 19,359 స్థాయి వద్ద ఉంది.
పడిపోయిన US స్టాక్స్
గురువారం, US 30-సంవత్సరాల బాండ్ల వేలంతో ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. దీంతోపాటు, ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు అమెరికన్ ఈక్విటీ మార్కెట్లకు మింగుడు పడలేదు. దీంతో, డో జోన్స్ 0.68%, S&P 500 0.81%, నాస్‌డాక్ 0.94% పతనమయ్యాయి.
ఆసియా షేర్లు పతనం
వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చని జెరోమ్ పావెల్ హెచ్చరించడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు పడిపోయాయి. దీనివల్ల స్టాక్స్, బాండ్లలో ర్యాలీ తగ్గి, పెట్టుబడిదార్లు డాలర్ వైపు అడుగులు వేస్తారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పెద్ద కార్లు కొనాలనుకుంటున్నారా? - కాస్త వెయిట్ చేయండి - ఇవి వచ్చేదాకా ఆగండి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial