అన్వేషించండి

RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!

RBI Plastic Currency: దేశంలో ప్లాస్టిక్ నోట్‌లు రానున్నాయి. 10,20 రూపాయాలు నోట్ల స్థానంలో కొత్త నోట్లు వస్తున్నాయని వెల్లడించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అయితే, అధిక ప్రారంభ ఖర్చులు, ఏటీఎంల మార్పు సవాళ్లే.

RBI Plastic Currency: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మరో కీలక యుగం ప్రారంభంకానుంది. నోట్ల రద్దు వరకు ఆన్‌లైన్ పేమెంట్‌ గురించి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలా చేతిలో మొబైల్ అందులో డిజిటల్ పేమెంట్ యాప్ ఉంటే దేశమంతా చుట్టి రావచ్చు. అయితే డిజిటల్ చెల్లింపులు ఎంత పెరుగుతున్నప్పటికీ ఫిజికల్ కరెన్సీ ప్రాధాన్యత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఏటా కోట్ల రూపాయల నోట్లు వివిధ కారణాలతో రద్దు చేయాల్సి వస్తోంది. అందుకే కరెన్సీలో మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. పది రూపాయలు, ఇరవై రూపాయలు ఇప్పుడున్న నోట్లను పూర్తిగా ప్రింటింగ్ ఆపేసి సరికొత్తగా ప్లాస్టిక్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్టు చెబుతోంది. 

ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశ పెడుతుందా?

ఆర్బీఐ తరఫున నోట్లు ముద్రించే విభాగంలో బీఆర్‌బీఎన్పీఎల్ కీలక ప్రకటన చేసింది.ప్లాస్టిక్ కరెన్సీకీ కావాల్సిన ముడిసరకు సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ముడిసరకు సరఫరా చేసేందుకు చేసేందుకు టెండర్లను పిలిచి అధికారికం ప్రక్రియ ప్రారంభించింది. ఈ విభాగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొవచ్చ. 

ప్లాస్టిక్ నోట్ అంటే ఏంటీ?

పాలిమర్ నోట్లనే ప్లాస్టిక్ నోట్లు అంటారు. వీటిని పాలిమర్ షీట్లపై ముద్రిస్తారు. ఇది ఫిల్మ్‌లా ఉంటుంది. ఇది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. దీనిపై పూత పూసి నోట్లకు సంబంధించిన వివరాలు ముద్రిస్తారు. దీన్ని డూప్లికేట్ చేయడానికి లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి ఒక వైపు చిన్న పలక మాదిరిగా పెడతారు. అందులో నోట్‌కు సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. దీని వల్ల ఇది ఫేక్ కాదని గుర్తించవచ్చు. అలాంటి వివరాలు లేకుంటే అది ఫేక్ అని నిర్దారణకు రావచ్చు. 

ముందు వచ్చే ప్లాస్టిక్ నోట్లు ఏంటీ?

ముందు పాలిమర్ నోట్లను పది, ఇరవై రూపాయల కెరన్సీతో ప్రారంభిస్తారు. ఇవి చాలా ఎక్కువ జనాలు వాడతారు. నార్మల్‌గా వీటి తయారీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. త్వరగా పాడైపోతాయి. అందుకే ముందుగా వాటినే ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకొస్తారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ నోట్ల పని తీరుపై ఒక సరైన అవగాహన వస్తుంది. ఇది విజయవంతం అయితే మిగతా నోట్లను కూడా ఈ విధానంలో ముద్రిస్తారు. 

జనం చేతికి ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు వస్తుంది?

త్వరలోనే పాలిమర్‌ నోట్లను తీసుకురాబోతున్నట్టు గత నెలలో జరిగిన ద్రవ్యవిధాన ప్రకటనలో ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. ఆయన చెప్పిన నెల రోజుల తర్వాత పాలిమర్ షీట్ల కోసం ఆర్బీఐ టెండర్లను పిలిచింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాలిమర్ సప్లై చేసే కంపెనీలు ఈ టెండర్‌లలో పాల్గొనవచ్చు. అయితే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైనప్పటికీ జనాల చేతికి ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే సరికి చాలా సమయం పట్టవచ్చు. 

ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడంలో ఆర్బీఐ పాటించే ప్రక్రియ ఏంటీ?

ఇప్పుడు ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ముడిసరకు కోసం ఆసక్తిని తెలపాలని మాత్రం చెప్పారు. తర్వాత టెండర్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం టెక్నికల్ పరిశీలన ఉంటుంది. మోడల్‌ను పరీక్షిస్తారు. దాన్ని భద్రతను పరిశీలిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద పది రూపాయలు, ఇరవై రూపాయల నోట్లతో చెలామణిలోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న కరెన్సీతోపాటు ప్లాస్టిక్ కరెన్సీ కూడా అందుబాటులోకి తెస్తారు. కొంతకాలం పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు.  

ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావాలని గతంలో ఎప్పుడైనా ప్రయత్నం జరిగిందా?

భారత్‌లో ప్లాస్టిక్ నోట్ చెలామణిలోకి తీసుకురావాలనే ఆలోచన 2009లో మొదలైంది. 2012లో పది రూపాయ నోట్లతోనే దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ముద్రించిన నోట్లను వివిధ పరిస్థితుల్లో ప్రయోగించాలని 2014లో భావించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టును ఆపేశారు. మళ్లీ 2026లో ప్రక్రియను మొదలు పెట్టారు. 

ప్లాస్టిక్ కరెన్సీ అవసరం ఏం వచ్చింది?

ఓవైపు డిజిటల్ చెల్లింపులు భారీగానే జరుగుతున్నాయి. అదే సమయంలో కరెన్సీ ప్రాధాన్యత తగ్గేదేలే అన్నట్టు ఉంది. 2026లో 42.86 కోట్ల రూపాయల నగదు దేశంలో చెలామణి అవుతోంది. అందుకే ఇందులో కోట్ల రూపాయల విలువైన కరెన్సీ వివిధ కారణాలతో నాశనమవుతోంది. వీటిని మళ్లీ ముద్రించేందుకు కోట్ల రూపాయలు ఆర్బీఐ ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోజనాలు ఏంటి?

ఎక్కువ కాలం మన్నిక అయ్యే ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు వస్తే ఆర్బీఐపై భారం తగ్గుతుందని ఆలోచన ఉంది. ఇప్పుడు ఉన్న కరెన్సీ కంటే నాలుగైదు సంవత్సరాలు ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. నీటిలో త్వరగా పాడయ్యే పరిస్థితి ఉండదు. నోటు త్వరగా నాశనం కాదు. ఇందులో భద్రతా ఫీచర్స్‌ కారణంగా ఫేక్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఈ విషయంలో ఆర్బీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ప్లాస్టిక్ కరెన్సీతో వచ్చే సమస్యలేంటి?

పాలిమర్ కరెన్సీ నోట్ల విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. భారత్ వంటి ఉష్ణ ప్రాంతంలో ప్లాస్టిక్ కరెన్సీ మనుగడ అంత ఈజీ కాదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ముడి పదార్థాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఇది ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. వాటిని భరించి పాలిమర్స్‌ కరెన్సీ తీసుకొచ్చినా... ఇప్పుడు ఉన్న ఏటీఎంలు, నోట్ల లెక్కింపు యంత్రాలు అన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులకు భారం కానుంది. పాలిమర్స్ నోట్లు మడిచినప్పుడు ముడతలు పడుతున్నాయే ఫిర్యాదు చాలా దేశాల్లో ఉంది. దీన్ని కూడా అధిగమించాల్సి ఉంటుంది. అయితే ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఆ ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు.  

ప్లాస్టిక్ కరెన్సీ అమలు చేస్తున్న దేశాలు ఏవి?

ప్రపంచంలోని చాలా దేశాల్లో పాలిమర్ కరెన్సీ చెలామణిలో ఉంది. దీన్ని మొదట తీసుకొచ్చింది మాత్రం ఆస్ట్రేలియా. ఇక్కడ 1988లోనే తొలిసారిగా అమల్లోకి వచ్చింది. తర్వాత అక్కడ వాటి ప్రయోజనాలను గుర్తించిన బ్రిటన్, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, వియత్నాం, మలేషియా, బ్రూనై వంటి 40 దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడుకలో ఉంది.

Frequently Asked Questions

ప్రపంచంలో ఏ ఏ దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని వాడుతున్నాయి?

ప్లాస్టిక్ కరెన్సీని మొదట ఆస్ట్రేలియా 1988లో ప్రవేశపెట్టింది. బ్రిటన్, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, వియత్నాం వంటి 40కి పైగా దేశాలు ప్రస్తుతం ఈ పాలిమర్ కరెన్సీని వాడుకలో ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget