By: ABP Desam | Updated at : 26 Jul 2022 11:56 AM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐటీఆర్ ఫైలింగ్ ( Image Source : Getty )
ITR Filing EPF: ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు సమీపిస్తోంది. ఆదాయపన్ను వెబ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో చాలామంది ఇంకా రిటర్నులు సమర్పించలేదు. దీనికి తోడు ఈపీఎఫ్ వడ్డీపై పన్నును ఎలా లెక్కించాలో తెలియక మరికొందరు సందిగ్ధావస్థలో పడ్డారు. ఎందుకంటే?
రూ.2.5 లక్షలు దాటితే పన్ను!
ఉద్యోగ భవిష్య నిధి (EPF) నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని వేర్వేరుగా 12 శాతం వరకు ప్రావిడెంట్ ఫండ్‌లో (Provident Fund) జమ చేస్తారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 10 (12) ప్రకారం గతంలో పీఎఫ్ వడ్డీపై (PF interest) పూర్తి మినహాయింపు ఉండేది. 2021 బడ్జెట్‌లో దీనిని సవరించారు. ఒక ఆర్థిక ఏడాదిలో ఉద్యోగి కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే ఆ పీఎఫ్ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వనరుల ద్వారా పొందుతున్న ఆదాయంగా దీనిని పరిగణనలోకి తీసుకుంటారు.
లెక్కించడంపై గందరగోళం!
పీఎఫ్ వడ్డీపై పన్నును (Taxable PF) ఎలా లెక్కించాలో 2021, ఆగస్టు 31న సీబీటీడీ కొత్త నిబంధనను నోటిఫై చేసింది. దీని ప్రకారం పన్ను వర్తించే, వర్తించని పీఎఫ్ ఖాతాలను వేర్వేరుగా నిర్వహించాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటాలి. ఇలాంటి ఖాతాల నుంచి వడ్డీ డబ్బును విత్‌డ్రా చేసినా పన్ను మినహాయింపేమీ ఉండదు. ఈపీఎఫ్‌తో ప్రైవేటు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులూ దీనిని తప్పకుండా పాటించాలి. పన్ను లెక్కింపు విధానంపై స్పష్టత ఇచ్చినా కొన్ని అంశాల్లో మాత్రం సందిగ్ధం నెలకొంది.
ఏ ప్రాతిపదికన లెక్కించాలి?
ఉదాహరణకు ఒక ఉద్యోగి మధ్యలోనే ఉద్యోగం మానేస్తే ఏం చేయాలి? మానేసిన సమయానికి పన్ను లెక్కించాలా లేదంటే ఏడాది ప్రాతిపదికన లెక్కించాలా అర్థమవ్వడం లేదు. టీడీఎస్ డిడక్టు చేయడం పైనా కన్ఫ్యూషన్ ఉంది. దీంతో 2022, ఏప్రిల్ 5న ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వడ్డీ క్రెడిట్ లేదా చెల్లించడంలో ఏదీ ముందు జరుగుతుందో దానిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే 2021-22 ఏడాదికి గాను ఈపీఎఫ్ ఇంకా వడ్డీని జమ చేయలేదు. అందుకే ఐటీఆర్ ఫైల్ చేయడంపై చాలామందిలో గందరగోళం నెలకొంది.
Also Read: హ్యాపీ న్యూస్! వీళ్లు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినా పెనాల్టీ ఉండదు!
Also Read: తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా! ఈ సింపుల్ ప్రాసెస్‌తో కన్‌ఫ్యూషన్ ఉండదు!
Cashback Credit Cards: ఆన్లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ
Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు