By: ABP Desam | Updated at : 23 Jul 2022 05:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐటీఆర్ ( Image Source : Pixels )
ITR filing penalty: ఆదాయపన్ను రిటర్ను దాఖలు తుది గడువు సమీపిస్తోంది. 2022-23 అసెస్‌మెంట్ ఏడాదికి గాను ఐటీఆర్ ఫైల్ చేసేందుకు 2022, జులై 31 చివరి తేదీ. ఆ లోపు పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గుడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి పెనాల్టీ ఉండదు.
వీరికి పెనాల్టీ ఉండదు
ఆదాయపన్ను చట్టాల (Income Tax) ప్రకారం ప్రతి ఒక్కరూ ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఆదాయం కనీస మినహాయింపు పరిమితిని (Basic Excemption Limit) దాటకపోతే వారు తుది గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేసినా పెనాల్టీ ఉండదు. 'కనీస మినహాయింపు పరిమితికి మించని ఆదాయం ఉండి, ఐటీఆర్‌ను ఆలస్యంగా సమర్పించినా సెక్షన్ 234F ప్రకారం వారికి ఆలస్య రుసుము వర్తించదు. సెక్షన్ 80సి నుంచి 80యూ కింద డిడక్షన్లను (Income Tax Deductions) తీసుకోకముందు ఉండే మొత్తం ఆదాయాన్ని గ్రాస్ ఇన్‌కమ్‌గా (Gross Income) పరిగణనలోకి తీసుకుంటారు' అని టాక్స్2విన్ సీఈవో అభిషేక్ సోని అంటున్నారు.
అర్హులు ఎవరు?
ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం ప్రకారం కనీస మినహాయింపు పరిమితిని రెండు రకాలు ఎంచుకుంటారు. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంచుకుంటే వయసుతో సంబంధం లేకుండా కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. పాత ఐటీ పద్ధతినే (Old Tax Regime) ఎంచుకుంటే మాత్రం వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం 60 ఏళ్లలోపు వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు. 60-80 ఏళ్ల మధ్య వారికి ఇది రూ.3 లక్షలుగా ఉంది. 80 ఏళ్లు పైబడిని సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలుగా ఉంది.
వీరికి పెనాల్టీ తప్పదు!
పై నిబంధనలకూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కనీస మినహాయింపు పరిమితిని మించి ఆదాయం లేకున్నా కొందరు వ్యక్తులు కచ్చితంగా ఐటీఆర్‌ను సమర్పించాలి. సెక్షన్ 139(1) ఏడో ప్రావిజన్ షరతులకు లోబడే వ్యక్తులు 2021-22 ఆర్థిక ఏడాదికి తుది గడువు లోపే కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే సెక్షన్ 234F కింద పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. వారు ఎవరంటే?
1) ఏదైనా బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకటి లేదా అంతకుమించి కరెంటు ఖాతాల్లో ఏక మొత్తంలో లేదా అగ్రిగేట్‌గా రూ.కోటికి మించి జమ చేస్తే ఐటీఆర్ సమర్పించాలి.
2) విదేశీ ప్రయాణాల్లో రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చైతే ఐటీఆర్ దాఖలు చేయాలి. వారి తరఫున రెండో వ్యక్తి వెళ్లినా సమర్పించాల్సిందే.
3) ఏక మొత్తంలో లేదా విడతల వారీగా లక్ష రూపాయలకు మించి విద్యుత్ బిల్లు దాటితే ఐటీఆర్ సమర్పించాలి.
4) భారత్‌లో కనీస మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉండి విదేశీ కంపెనీ షేర్లు ఉన్నా అందులో వాటాలు ఉన్నా, ఆస్తులున్నా, వాటిద్వారా ఆదాయం వస్తున్నా ఐటీఆర్ కచ్చితంగా దాఖలు చేయాలి.
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!