ITR filing penalty: ఐటీఆర్‌ లేటైతే ఎవరికి ఎంత పెనాల్టీ?

ఆదాయపన్ను రిటర్ను దాఖలు తుది గడువు సమీపిస్తోంది.

2022-23 అసెస్‌మెంట్‌ ఏడాదికి గాను ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు 2022, జులై 31 చివరి తేదీ.

ఆ లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది.

గతేడాది వరకు ఐటీఆర్‌ పెనాల్టీ రూ.10,000గా ఉండేది.

మీరు కట్టాల్సిన పన్ను రూ.100 అని ఊరుకుంటే రూ.10వేలు కట్టాల్సి వచ్చేది.

ప్రస్తుతం ఐటీఆర్ పెనాల్టీని రూ.10వేల నుంచి రూ.5వేలకు తగ్గించారు.

కొందరు గడువు తర్వాత సమర్పించినా ఎలాంటి పెనాల్టీ ఉండదు.

కొత్త పన్ను విధానంలో రూ.2.5 లక్షల లోపు ఆదాయం గలవారికి పెనాల్టీ లేదు.

పాత విధానంలో 60 ఏళ్లలోపు రూ.2.5 లక్షలు, 60-80 ఏళ్లకు రూ.3 లక్షలు, 80+ పైవారికి రూ.5 లక్షలుగా ఉంది.