రణ్‌బీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటించిన షంషేరా సినిమా థియేటర్లలో విడుదల అయింది.



మొఘల్‌ల పాలనలో రాజ్‌పుత్‌ల తరఫున పోరాడిన ఒక తెగ వారి కథ ఇది. వీరు తక్కువ కులం అంటూ వివక్షకు గురవుతారు.



ఇదే తెగకు చెందిన షంషేరా (రణ్‌బీర్ కపూర్) బందిపోటుగా ధనికులను దోచుకుంటూనే, వారి స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటాడు.



శుద్ధ్ సింగ్ (సంజయ్ దత్) వీరికి స్వాతంత్రం కల్పిస్తామని మోసం చేసి ఒక కోటలో బంధించి మరింత దారుణంగా హింసిస్తాడు.



తప్పించుకోవడానికి ప్రయత్నించిన షంషేరాపై ద్రోహి అనే ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు.



25 సంవత్సరాల తర్వాత అతని కొడుకు బల్లి (రణ్‌బీర్ కపూర్) తండ్రి చావుకు పగ తీర్చుకోవాలని పోరాడతాడు.



తండ్రి చావుకు కొడుకు పగతీర్చుకునే కథలు మనకు కొత్తేమీ కాదు. దాదాపు 1960ల నుంచి మనం ఇటువంటి కథలు చూస్తూనే ఉన్నాం.



అయితే పేలవమైన స్క్రీన్, వీక్ క్యారెక్టర్స్ సినిమాను బోరింగ్‌గా మార్చాయి.



రణ్‌బీర్ సింగ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.



ఏబీపీ దేశం రేటింగ్: 1.5/5
(All Images Credits: YRF)