సొంతంగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం ఎలాగంటే!

మొదట https://www.incometax.gov.in/iec/foportalకు వెళ్లాలి.

యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. e-file ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత 'File Income Tax Return' ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.

అసెస్‌మెంట్‌ ఏడాదిని ఎంచుకొని కంటిన్యూ క్లిక్‌ చేయాలి. ఫైలింగ్‌ విధానాన్ని 'ఆన్‌లైన్‌' అని ఎంచుకోవాలి.

మీరు వ్యక్తిగత ఆదాయ పన్ను ఫైలింగ్‌ చేస్తుంటే 'ఇండివిజ్యువల్‌'పై క్లిక్‌ చేయండి.

ఐటీఆర్‌ ఫామ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీరు ఐటీఆర్‌ దాఖలు ఎందుకు చేస్తున్నారో కారణం చెప్పాలి.

మీ బ్యాంకు వివరాలను వ్యాలిడేట్‌ చేయాలి. ఆ తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేసే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

మీరిచ్చిన సమాచారం సరైందో కాదో తనిఖీ చేసుకొని ఐటీఆర్‌ సమ్మరీని వ్యాలిడేట్‌ చేసుకోవాలి.

ఆదాయపన్ను శాఖకు పేపర్ కాపీ వెళ్లే ముందు మీ రిటర్న్స్‌ను తనిఖీ చేయాలి.