search
×

ITR Process: తొలిసారి ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా! ఈ సింపుల్‌ ప్రాసెస్‌తో కన్‌ఫ్యూషన్‌ ఉండదు!

Income Tax Return Process:పాతవాళ్లకు అలవాటే గానీ కొత్తవాళ్లు లేదా తొలిసారి ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నవారికి కాస్త గందరగోళానికి గురవుతారు. మీరూ అలాంటి సిచ్యువేషన్‌లోనే ఉంటే ఈ ప్రాసెస్‌ను ఫాలో అయిపోండి.

FOLLOW US: 

How to File ITR: మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.2,50,000 దాటిందా? మీకేమైనా స్థిర, చరాస్తులు ఉన్నాయా? అయితే ఏటా మీరు కచ్చితంగా ఐటీఆర్‌ (Income Tax Return) సమర్పించాల్సిందే. పాతవాళ్లకు అలవాటే గానీ కొత్తవాళ్లు లేదా తొలిసారి ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నవారికి కాస్త గందరగోళానికి గురవుతారు. మీరూ అలాంటి సిచ్యువేషన్‌లోనే ఉంటే ఈ ప్రాసెస్‌ను సింపుల్‌గా ఫాలో అయిపోండి.

ఏంటీ ఐటీఆర్‌?

ఐటీఆర్‌ (Income Tax Return) అంటే మరేం లేదు! ఏటా మీ ఆదాయం ఎంత వస్తుందో ఆదాయ పన్ను శాఖకు మీరు వార్షిక నివేదిక ఇవ్వడమే! వేతనం, పెట్టుబడులు, వ్యాపారం, ఇంటి అద్దె, ఇతర వనరుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో మీరు ఇందులో తెలియజేస్తారు. కనీస అవగాహన ఉంటే ఐటీఆర్‌ను (ITR) మీరే స్వయంగా ఫైల్‌ చేయొచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఇది సులభమే. పైగా ఈ-ఫైలింగ్‌ చేయడం వల్ల ఎవరికీ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఏ డాక్యుమెంట్లు అవసరం?

ఆదాయపన్ను వెబ్‌సైట్లో మీ వివరాలు నమోదు చేసుకొనేందుకు, ఐటీఆర్‌ ఫైల్‌ (ITR Filing) చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం. పాన్‌ (PAN), ఆధార్‌ (Aadhar), బ్యాంకు ఖాతా, ఫామ్‌ 16, ఇతర ఆదాయాల సమాచారం, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి.

ఐటీ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ

 • ముందు అధికారిక ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportalను ఓపెన్‌ చేయండి.
 • 'రిజిస్టర్‌'పై క్లిక్‌ చేసి 'టాక్స్‌ పేయర్‌' ఆప్షన్‌ ఎంచుకోండి.
 • ఇప్పుడు మీ పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయండి. ఆ పక్కనే వ్యాలిడేట్‌ బటన్‌ కొట్టి కంటిన్యూపై క్లిక్‌ చేయండి.
 • మీ ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, కాంటాక్టు వివరాలు ఇవ్వండి.
 • ఫామ్‌ నింపడం పూర్తయ్యాక మీ వివరాలను ఒకసారి తనిఖీ చేసుకొని కంటిన్యూపై క్లిక్‌ చేయండి.
 • మీ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. వాటిని ఎంటర్‌ చేయండి.
 • ఆ తర్వాత మీ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ సెటప్‌ చేసుకోవాలి.
 • చివరికి మీ నమోదు ప్రక్రియ విజయవంతమైందని సందేశం వస్తుంది.
 • ఆ తర్వాత మీ అకౌంట్లో లాగిన్‌ అయ్యి ఐటీఆర్‌ సమర్పించొచ్చు. టాక్సబుల్‌ ఇన్‌కమ్‌, డిడక్షన్స్‌ వంటివి గణించొచ్చు.

ఐటీఆర్‌ ఫైలింగ్ ప్రాసెస్‌

ఇక ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు కొన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పన్ను చట్టాలను అనుసరించి చెల్లించాల్సిన పన్నును లెక్కించాలి. 26AS ఫామ్‌ను ఉపయోగించుకొని అసెస్‌మెంట్‌ ఏడాదిలోని నాలుగు త్రైమాసికాల్లో మీ టీడీఎస్‌ చెల్లింపుల మొత్తం లెక్కించాలి. అంతా పూర్తయ్యాక మీ పన్ను శ్లాబ్‌, కేటగిరీని ఎంచుకొని ఐటీఆర్‌ ఫామ్‌ (ITR Form) నింపాలి.

Also Read: హ్యాపీ న్యూస్‌! వీళ్లు ఆలస్యంగా ఐటీఆర్‌ ఫైల్‌ చేసినా పెనాల్టీ ఉండదు!

ఈ-ఫైలింగ్‌ ప్రక్రియ

 • మొదట https://www.incometax.gov.in/iec/foportalకు వెళ్లాలి.
 • యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. e-file ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత 'File Income Tax Return' ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
 • అసెస్‌మెంట్‌ ఏడాదిని ఎంచుకొని కంటిన్యూ  క్లిక్‌ చేయాలి.
 • ఫైలింగ్‌ విధానాన్ని 'ఆన్‌లైన్‌' అని ఎంచుకోవాలి.
 • మీరు వ్యక్తిగత ఆదాయ పన్ను ఫైలింగ్‌ చేస్తుంటే 'ఇండివిజ్యువల్‌'పై క్లిక్‌ చేయండి.
 • ఐటీఆర్‌ ఫామ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీరు ఐటీఆర్‌ దాఖలు ఎందుకు చేస్తున్నారో కారణం చెప్పాలి.
 • మీ బ్యాంకు వివరాలను నమోదు చేయండి. అప్పుడే ఎంటర్‌ చేస్తే వ్యాలిడేట్‌ చేయాలి.
 • ఆ తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేసే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
 • మీరిచ్చిన సమాచారం సరైందో కాదో తనిఖీ చేసుకొని ఐటీఆర్‌ సమ్మరీని వ్యాలిడేట్‌ చేసుకోవాలి.
 • ఆదాయపన్ను శాఖకు పేపర్ కాపీ వెళ్లే ముందు మీ రిటర్న్స్‌ను తనిఖీ చేసుకోవాలి.
 • ఆ తర్వాత కాపీని ఐటీ శాఖకు పంపించాలి.
Published at : 23 Jul 2022 06:29 PM (IST) Tags: Income Tax ITR Income Tax Return it return itr Process How to File ITR Tax Payer

సంబంధిత కథనాలు

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Petrol-Diesel Price, 17 August: నేడు వాహనదారులకు శుభవార్త, చాలా దిగొచ్చిన ఇంధన ధరలు

Petrol-Diesel Price, 17 August: నేడు వాహనదారులకు శుభవార్త, చాలా దిగొచ్చిన ఇంధన ధరలు

టాప్ స్టోరీస్

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?