X

India Q2 GDP Data: జీడీపీ సర్‌ప్రైజ్‌..! 8.4% పెరిగింది కానీ.. ఒమిక్రాన్‌ ఏం చేస్తోందోనని బెంగ!

ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4శాతం పెరిగింది. డెల్టా వేరియెంట్‌, రెండో వేవ్‌ తర్వాత ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంది.

FOLLOW US: 

భారత ఆర్థిక వ్యవస్థ ఘనంగా పుంజుకుంటోంది. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4శాతం పెరిగింది. డెల్టా వేరియెంట్‌, రెండో వేవ్‌ తర్వాత ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి జీడీపీ 7 శాతానికి పైగా కుంచించుకుపోవడం గమనార్హం.

పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకొంది. భారత జీడీపీలో ప్రైవేటు వినియోగానిదే ఎక్కువ వాటా అనడంలో సందేహం లేదు. రెండో త్రైమాసికంలో జీవీఏ 8.5 శాతం పెరిగింది. నామినల్‌ జీడీపీ 17.5 శాతం వృద్ధి సాధించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఒకింత ఇబ్బంది పెట్టినా ప్రభుత్వ స్పెండింగ్‌ పెరగడం, వడ్డీరేట్లు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు పొందింది. కొవిడ్‌ వ్యాప్తి తగ్గిపోవడం, వ్యాక్సినేషన్‌ పెరగడం, ఆంక్షలు రద్దవ్వడమూ ఇందుకు దోహదం చేసింది.

ఆగస్టు, సెప్టెంబర్లో రైల్వే సరకు రవాణా పెరగడం, సిమెంటు ఉత్పత్తి పెరగడం, విద్యుత్తుకు డిమాండ్‌ పుంజుకోవడం, ఓడ రేవుల్లో సరకు నిల్వ పెరుగుదల, ఈవే బిల్లుల పెరుగుదల, జీఎస్‌టీ, టోల్‌ రాబడి పెరగడం వంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతాలుగా నిలిచాయని ఆర్‌బీఐ అక్టోబర్‌ విధాన సమీక్షలో తెలిపింది.

జీడీపీ పెరుగుదల సంతోషం కలిగిస్తున్నప్పటికీ కొంత ఆందోళన లేకపోలేదు. ఇప్పుడే ఒమిక్రాన్‌ రూపంలో కొత్త వేరియెంట్ బయటపడింది. దీని వ్యా్ప్తి, తీవ్రతపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటికైతే ప్రమాద తీవ్రత తక్కువే అంటున్నా రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మళ్లీ ఆంక్షలు విధించాల్సి వస్తే, లాక్‌డౌన్‌లు పెట్టాల్సి వస్తే మాత్రం ఆర్థిక వ్యవస్థకు చేటు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత

Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!

Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: India GDP GDP India GDP Growth India Q2 GDP India GDP 2021 India GDP Growth Rate India Q2 GDP Data

సంబంధిత కథనాలు

Budget 2022 Healthcare Sector Expectations: కరోనా నేర్పిన గుణపాఠం!  బడ్జెట్‌లో 'బూస్టర్‌ డోస్‌' తప్పదు!!

Budget 2022 Healthcare Sector Expectations: కరోనా నేర్పిన గుణపాఠం! బడ్జెట్‌లో 'బూస్టర్‌ డోస్‌' తప్పదు!!

Great Republic Day Sale: స్మార్ట్‌ టీవీ కావాలా? అమెజాన్‌లో 50% ఆఫ్‌.. త్వరపడండి!

Great Republic Day Sale: స్మార్ట్‌ టీవీ కావాలా? అమెజాన్‌లో 50% ఆఫ్‌.. త్వరపడండి!

Cryptocurrency Prices On January 21 2022: క్రిప్టోల పతనం! ఒక్కరోజులోనే రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. విలవిల్లాడుతున్న బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices On January 21 2022: క్రిప్టోల పతనం! ఒక్కరోజులోనే రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. విలవిల్లాడుతున్న బిట్‌కాయిన్‌

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Stock Market Update: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు హాం ఫట్‌! నేడూ నష్టాల్లోనే మార్కెట్లు

Stock Market Update: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు హాం ఫట్‌! నేడూ నష్టాల్లోనే మార్కెట్లు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి ఇండియన్‌ ఫ్యామిలీ బలి

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి  ఇండియన్‌ ఫ్యామిలీ బలి

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?