By: ABP Desam | Updated at : 29 Nov 2021 02:19 PM (IST)
Edited By: Murali Krishna
క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత
క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ మేరకు తెలిపారు.
Govt of India does not collect data on Bitcoin transactions. No proposal to recognise Bitcoin as a currency in the country: Ministry of Finance in a written reply in Lok Sabha
— ANI (@ANI) November 29, 2021
డేటా సేకరించడం లేదు..
బిట్‌కాయిన్ లావాదేవీలపై తమ ప్రభుత్వం ఎలాంటి సమాచారం సేకరించడం లేదని సీతారామన్ అన్నారు. దీన్ని కరెన్సీగా గుర్తిస్తారా అన్న ప్రశ్నకు 'లేదు' అని సీతారామన్ సమాధానమిచ్చారు.
బిట్‌కాయిన్ అంటే..
బిట్‌కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2008లో దీన్ని రూపొందించారు. ఈ కరెన్సీ భౌతిక రూపంలో ఉండదు. ప్రతిదీ డిజిటల్‌గానే జరుగుతుంది. బ్లాక్‌చైన్ సాంకేతికతపై బిట్‌కాయిన్ విలువ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో బిట్కాయిన్లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమే. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌పై భారత్‌లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.
క్రిప్టో బిల్లు..
ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 'ది క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021'ను తీసుకురానునుంది.
ఆర్‌బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీ విధివిధానాలను ఈ బిల్లు ద్వారా జారీ చేయనున్నారు. అలాగే దేశంలోని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించనున్నారు.
Also Read: Parliament Winter Session: సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. రైతుల హర్షం
Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త
Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు