By: ABP Desam | Updated at : 28 Nov 2021 05:32 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పోస్టాఫీసు స్కీమ్
ఎలాంటి నష్టభయం లేని పెట్టుబడులుపై చాలామంది మొగ్గు చూపుతుంటారు. తక్కువ పెట్టబడి పెట్టినా ఎక్కువ రాబడి వచ్చే పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి పోస్టాపీసులోని రికరింగ్ డిపాజిట్ పథకం ఎంతో ఉపయోగకరం. కేవలం రూ.100 ఆరంభించి మెచ్యూరిటీకి రూ.16 లక్షల వరకు పొందొచ్చు.
సురక్షితం
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అత్యంత సురక్షితమైంది. అసలేమాత్రం నష్టం భయం ఉండదు. రూ.100తో ఈ ఖాతాను తెరవొచ్చు. ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం మొత్తం రూ.100. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. అంటే మీకు నచ్చినంత డబ్బును జమ చేసుకోవచ్చు.
వడ్డీరేటు ఫర్వాలేదు
కనీసం ఐదేళ్ల కాల పరిమితితో మీరు ఆర్‌డీ తెరవాల్సి ఉంటుంది. డిపాజిట్లపై ప్రతి మూడు నెలలకు వార్షిక ప్రాతిపదికన వడ్డీని జమ చేస్తారు. అంతేకాకుండా మొత్తం జమపై కంపౌడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2020, జులై 1 నుంచి 5.8 శాతం వడ్డీరేటును అమలు చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరిస్తుంది.
రూ.10వేలు పెడితే..
ఈ ఆర్‌డీ పథకంలో మీరు పదేళ్ల వరకు నెలకు రూ.10వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.16.28 లక్షలు అందుకోవచ్చు. అయితే మరో ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఈ పథకంలో క్రమం తప్పకుండా ప్రతినెలా సమయానికి డబ్బులు జమ చేయాలి. గడువు తప్పితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా ఒక శాతం జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వరుసగా నాలుగు నెలలు కట్టకపోతే మీ ఖాతా ముగుస్తుంది. మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రెండు నెలలు ఆగాలి.
నిబంధనలు ఇవీ..
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ను సింగిల్ లేదా జాయింట్‌గా తెరవొచ్చు. జాయింట్ ఖాతాలో గరిష్ఠంగా ముగ్గురికే అవకాశం ఉంది. పదేళ్ల వయసు పిల్లలు గార్డియన్ సమక్షంలో ఖాతా తెరవొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ సమయం ఐదేళ్లే అయినా మరో ఐదేళ్ల పాటు పొడగించుకోవచ్చు. ఈ ఖాతాకు నామినీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత ప్రీక్లోజర్ అవకాశం ఉంటుంది.
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: UAN-Aadhar Linking: నవంబర్ 30 లోపు యూఏఎన్, ఆధార్ లింక్ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు
Also Read: SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు
Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?
Also Read: Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Cyber Attack On Pensions: సైబర్ నేరగాళ్ల ఫోకస్ మీ పెన్షన్‌పై పడింది - ఒక్క క్లిక్‌తో మీ డబ్బంతా పోతుంది, జాగ్రత్త!
Insurance Free-Look Period: బీమా పాలసీ ఫ్రీ-లుక్ పీరియడ్ నెల నుంచి సంవత్సరానికి పెంపు!- మీకు చాలా ప్రయోజనం
Stock Market Fall: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్‌లో విధ్వంసం - రెండు రోజుల్లోనే రూ.1,600 కోట్ల నష్టం
Gold-Silver Prices Today 18 Feb: ఆగని పసిడి దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
SBI JanNivesh SIP: SBI స్పెషల్ ఆఫర్ - కేవలం రూ.250తో మ్యూచువల్ ఫండ్ SIP, ఛార్జీలు రద్దు
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?