By: ABP Desam | Updated at : 27 Nov 2021 03:34 PM (IST)
Edited By: Ramakrishna Paladi
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు షాకిచ్చిన సంగతి గుర్తుందా? ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టిన ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్ రుసుము, దాంతో పాటు పన్నులూ వసూలు చేస్తామని ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ కొన్ని రోజుల క్రితం తెలిపింది. 2021, డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలుంది. రిటైల్ షాపులు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈకామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసిన వాటి ఈఎంఐల పైనా రుసుము వసూలు చేస్తారు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంస్థ కొన్ని రోజుల క్రితం ఒక మెయిల్ పంపించింది. 'ప్రియమైన వినియోగదారుడా! మర్చంట్ ఔట్‌లెట్, వెబ్‌సైట్, యాప్‌ల్లో చేసే అన్ని రకాల ఈఎంఐ లావాదేవీలపై 2021, డిసెంబర్ 1 నుంచి రూ.99 ప్రాసెసింగ్ ఫీజు, పన్నులు వర్తిస్తాయి' అని ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ మెయిల్‌లో వివరించింది. ఈ నిబంధన వల్ల కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
సాధారణంగా ఈఎంఐ లావాదేవీలపై బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తూ వ్యాపారస్థులే వినియోగదారులకు రాయితీలు ఇస్తున్నారు. కొనుగోలు చేసినప్పుడు 'జీరో ఇంట్రెస్ట్' ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలాంటి లావదేవీల పైనా డిసెంబర్ 1 నుంచి ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయనున్నారు. ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీల పైనే రుసుము చెల్లించాలి. సంబంధిత లావాదేవీ విఫలమైతే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు. ప్రీ క్లోజర్ చేస్తే మాత్రం ఇవ్వరు.
ముందే ఉపయోగించిన లావాదేవీ ఈఎంఐ డిసెంబర్ తర్వాత మొదలవుతుంటే దానిపై ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదు. కానీ రివార్డు పాయింట్లైతే ఇవ్వరు. 'పరిశ్రమ ప్రమాణాల ప్రకారమే ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ప్రైవేటు సంస్థలు చాన్నాళ్ల నుంచే దీనిని వసూలు చేస్తున్నాయి' అని సంస్థకు చెందిన ఒకరు మీడియాకు తెలిపారు.
వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఈఎంఐల్లో కలిసే ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనే పథకాలపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!
Also Read: Electric Flying Taxi: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
SEBI: డీమ్యాట్ అకౌంట్‌లో నామినీ పేరు చేర్చడానికి మరింత సమయం, కొత్త డెడ్‌లైన్ ఇది!
Petrol-Diesel Price 27 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Stocks To Watch 27 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Infy, HealthCare Global, Century Tex
Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.27వేలు పెరిగిన బిట్‌కాయిన్
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
/body>