X

GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

ఆటో ప్రయాణాలపై ప్రభుత్వం జీఎస్‌టీ విధించింది. త్వరలో ఐదు శాతం పన్ను పడనుంది. అయితే ఒక మినహాయింపు ఉంది.

FOLLOW US: 

మీరు బయటకు వెళ్లేందుకు ఆటోలు ఉపయోగిస్తారా? ఓలా, ఉబెర్‌ వంటి యాప్స్‌లో ఆటో, కార్లను బుక్‌ చేస్తుంటారా? అయితే జనవరి నుంచి మీరు ఎక్కువ చెల్లించక తప్పదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈకామర్స్‌ వేదికల ద్వారా బుక్‌ చేసుకొనే ఆటో ప్రయాణాలపై వస్తు సేవల పన్ను (GST) విధించనుంది. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఆటోలను బుక్‌ చేసుకుంటే ఎలాంటి పన్ను లేదు. అదనపు భారం పడేది కాదు. జనవరి నుంచి ఇలాంటి ప్రయాణాలపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవన్యూ శాఖ రద్దు చేసింది. ఒక శుభవార్త ఏంటంటే ఆఫ్‌లైన్‌ లేదా బయట ఉండే ఆటో సేవలను వాడుకుంటే మాత్రం ఎలాంటి పన్ను భారం ఉండదు. నేరుగా ఆటోలను పిలిచి ఉపయోగించుకుంటే జీఎస్‌టీ వర్తించదు.

చాలా మంది తమ గమ్య స్థానాలు, కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్‌, ఓలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్‌ వేదికలను ఉపయోగించుకుంటున్నారు. అనుకూలంగా ఉండటం, సమయానికి అందుబాటులో దొరకడం, వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే బుక్‌ చేసుకొనే సౌకర్యం ఉండటంతో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీటిపై జీఎస్‌టీ విధించడం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కొందరు అంటున్నారు. బహుళజాతి సంస్థలకు వ్యతిరేక సూచనలు పంపినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. ఒకే సేవను వాడుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌లో పన్ను పడటం, ఆఫ్‌లైన్‌లో లేకపోవడం వివక్ష కిందకు వస్తుందన్న సంకేతాలు ఇస్తుందని అంటున్నారు!

Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!

Also Read: UAN-Aadhar Linking: నవంబర్‌ 30 లోపు యూఏఎన్‌, ఆధార్‌ లింక్‌ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు

Also Read: SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్‌ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు

Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?

Also Read: Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: GST Ola auto Auto Ride Booking Uber

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర, రూ.1400 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర, రూ.1400 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!

Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!

Stock Market Update: ఆరంభ లాభాలు ఆవిరి! సెన్సెక్స్‌ ఉదయం 800+, సాయంత్రం -76

Stock Market Update: ఆరంభ లాభాలు ఆవిరి! సెన్సెక్స్‌ ఉదయం 800+, సాయంత్రం -76
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా  చేయాలట….

Himaja: డబ్బులిచ్చి రాయిస్తున్నారు... ఆ వార్తలపై ఫైర్ అయిన హిమజ!

Himaja: డబ్బులిచ్చి రాయిస్తున్నారు... ఆ వార్తలపై ఫైర్ అయిన హిమజ!