Cryptocurrency Prices Today: స్టాక్స్ లాభాల్లో..! మరి క్రిప్టో మార్కెట్లో ఎందుకిలా..?
పెట్టుబడులను వెనక్కి తీసుకొనేందుకే ఎక్కువ మంది మదుపర్లు మొగ్గు చూపడంతో 24 గంటల వ్యవధిలో ఇది 0.73 శాతం తగ్గి రూ.45,08,197 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్ విలువ రూ.82,71,885 కోట్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో గురువారం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొనేందుకే ఎక్కువ మంది మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. బిట్‌కాయిన్ ఎక్కువగా నష్టపోతోంది. 24 గంటల వ్యవధిలో ఇది 0.73 శాతం తగ్గి రూ.45,08,197 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్ విలువ రూ.82,71,885 కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరెమ్ 3.62 శాతం తగ్గి రూ.3,62,611 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.41,73,532కు చేరుకుంది.
బైనాన్స్ కాయిన్ 3.04 శాతం తగ్గి రూ.59,662, టెథెర్‌లో మార్పు లేకపోవడంతో రూ.80.18, సొలానా 2.89 శాతం పెరిగి రూ.18,272, కర్డానో 0.19 శాతం తగ్గి రూ.128, రిపుల్ 3.22 శాతం తగ్గి రూ.77.53 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ లెడ్జ్, టెర్రా, పాలీగాన్, యూనిస్వాప్, స్టేటస్, క్వార్క్‌చైన్, లైవ్‌పీర్ లాభపడగా గోలెమ్, బేసిక్ అటెన్షన్, అవె, కర్వ్‌డావో, ఎయిర్ స్వాప్, సుషి, స్టార్జ్ వంటివి నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: December Financial Changes: డిసెంబర్లో డబ్బు పరంగా జరిగే మార్పులివే..! లేదంటే..!
Also Read: GST Collections: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
Also Read: GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
Also Read: SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
Also Read: Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి