GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండానే వెళ్లిన ఉద్యోగి నుంచి రికవరీ చేసే మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని AAR ఆదేశించింది. నోటీస్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ వర్తిస్తుందని వెల్లడించింది.
వేరే కంపెనీలో ఉద్యోగం దొరికిందా? ఎక్కువ ప్యాకేజీకి వెళ్తున్నారా? పాత సంస్థలో నోటీస్ పిరియడ్ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్నారా? అయితే ఇకపై మీరు 18 శాతం వరకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
కొవిడ్ తర్వాత ఐటీ, ఐపీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ మార్పిడీ రేటు చాలా పెరిగింది. మెరుగైన వేతనాలు లభిస్తుండటం, నిపుణుల కొరత ఉండటంతో ఉద్యోగులు వేరే కంపెనీలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండానే వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగి నుంచి రికవరీ చేసే మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అడ్వాన్స్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) ఆదేశాలు జారీ చేసింది. నోటీస్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్, టెలిఫోన్ బిల్లులపై జీఎస్‌టీ వర్తిస్తుందని వెల్లడించింది.
భారత్ పెట్రోలియానికి చెందిన భారత్ ఒమన్ రిఫైనరీస్ కంపెనీ కేసులో ఏఏఆర్ ఈ తీర్పునిచ్చింది. దీంతో ఇకపై నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా వెళ్లే ఉద్యోగులు తీసుకున్న వేతనంపై వస్తు సేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నోటీస్ సమయంలో ఉద్యోగికి కంపెనీ సేవలను అందుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుందని, అలాంటి లావాదేవీలపై పన్ను పడుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజీనామా చేసి వెళ్లిపోయే ముందు తీసుకుంటున్న నగదుపై పన్ను శాఖ మరింత పర్యవేక్షణ చేయబోతోందని తెలిసింది.
2020, జులైలోనూ అమ్‌నియల్ ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మదాబాద్ కేసులో గుజరాత్ ఏఏఆర్ ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. లావాదేవీలు సేవల కిందకు వస్తాయి కాబట్టి నోటీస్ పిరియడ్ సర్వ్ చేయని ఉద్యోగి నుంచి రికవరీ చేసిన మొత్తంపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలని ఆదేశించింది.
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!