Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..
విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,500 గా ఉంది.
![Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే.. Gold Silver Price Today 1 December 2021 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/427cad5d09b62898be76f212d524766d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. గ్రాముకు రూ.10 తగ్గింది. వెండి ధరలో మాత్రం గ్రాముకు రూ.1.10 తగ్గి.. కిలోకు రూ.1100 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,850 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,930 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,850 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,930గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,500గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,120 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,120గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.15 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,321 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?
Also Read: India Q2 GDP Data: జీడీపీ సర్‌ప్రైజ్..! 8.4% పెరిగింది కానీ.. ఒమిక్రాన్ ఏం చేస్తోందోనని బెంగ!
Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)