Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో ఓ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తన పేరిట ఉన్న సగం షేర్లను అమ్మేశారు.
మైక్రోసాఫ్ట్ లో తన పేరిట ఉన్న షేర్లలో సగం షేర్లను.. ఆ కంపెనీ సీఈవో సత్య నాదేళ్ల అమ్మేసినట్టు తెలుస్తోంది. 8,38,584 షేర్లు అంటే.. సుమారు 285 మిలియన్ డాలర్ల విలువైనవి గత వారమే నాదెళ్ల అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. సత్య నాదేళ్ల వ్యక్తిగత కారణాలతోనే.. షేర్లు అమ్ముకున్నారని.. మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. వేరే ఎలాంటి విషయం లేదని స్పష్టం చేసింది. మరోవైపు చూసుకుంటే.. కొంతకాలంగా యూఎస్ స్టాక్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ ధరలు స్వల్ఫ క్షీణతను చూస్తోంది. ఇలాంటి క్రమంలో.. సత్య నాదెళ్ల షేర్లు అమ్మేసుకోవడం చర్చనీయాంశమైంది. తాజా షేర్ల అమ్మకంతో ప్రస్తుతం నాదెళ్ల దగ్గర 8,30,791 షేర్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.
జనవరి 1, 2022 నుంచి అమెరికాలో కొత్త చట్టం అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన షేర్లు అమ్మేసుకున్నట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో మాత్రమే కాదు.. ఎలన్ మస్క్ లాంటి వాళ్లు కూడా.. కొత్త చట్టం కారణంగా అమ్మేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కారణంగా ఆయన షేర్లు అమ్మేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చట్టం ప్రకారం.. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ 2,50,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే వాళ్లు పన్ను చెల్లించాలి. స్టాక్, బిజినెస్ ఓనర్‌షిప్ అమ్మకాల మీద అమెరికా ప్రభుత్వం 7 శాతం పన్ను విధిస్తుంది. ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు చేసిన ప్రతిపాదన ప్రకారం.. స్టాక్స్ ధర పెరిగితే.. షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేసే ఛాన్స్ ఉంది.
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?
Also Read: India Q2 GDP Data: జీడీపీ సర్‌ప్రైజ్..! 8.4% పెరిగింది కానీ.. ఒమిక్రాన్ ఏం చేస్తోందోనని బెంగ!
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read; Stock Market Update: 1300 పాయింట్లు అటూ.. ఇటూ..! నిఫ్టీ మరింత పడిపోనుందా?
Also Read: Crypto Advertisements: క్రిప్టోపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ఏంటో తెలుసా?
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!