Crypto Advertisements: క్రిప్టోపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ఏంటో తెలుసా?
రాజ్యసభలో క్రిప్టో కరెన్సీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రకటనలు నిషేధించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మున్ముందు ఏం చేయాలో కూలంకషంగా నిపుణులతో చర్చించామన్నారు.
క్రిప్టో కరెన్సీ ప్రకటనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో ప్రకటనల నిషేధంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదో ప్రమాదకరమైన అంశమని, పూర్తిగా నియంత్రణ పరిధిలో లేనిదని వెల్లడించారు. రాజ్యసభలో క్రిప్టో ప్రకటనల నిషేధంపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.
'నేనిప్పుడు ఏం చెప్పినా రాబోయే క్రిప్టో కరెన్సీ బిల్లు గురించి ముందే చెప్పినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువగా చర్చించడం లేదు' అని నిర్మలా సీతారామన్ ప్రశ్నోత్తరాల సమయంలో బదులిచ్చారు. 'క్రిప్టో కరెన్సీ ప్రకటనలను నిషేధించే చర్యలు ఇంకేమీ చేపట్టలేదు. కానీ ఇన్వెస్టర్లను మాత్రం అప్రమత్తం చేస్తున్నాం. మరిన్ని వివరాలు బిల్లులో ఉంటాయి' అని ఆమె తెలిపారు.
ఆర్‌బీఐ, సెబీ ద్వారా మదుపర్లను అప్రమత్తం చేస్తున్నామని నిర్మల వెల్లడించారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 'ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. విషయం తీవ్రతను తెలియజెప్పేందుకు ఇంకా మరెంతో చేయాల్సిన అవసరం ఉందని నేను అంగీకరిస్తున్నా. అవాంఛనీయ కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీలు దారితీసే ప్రమాదం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే చాలా స్థాయిల్లో చర్చించాం' అని ఆమె తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంపై నిర్మల మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా ఉండేందుకు ఎలాంటి విధానం లేదని, తాము ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. తమ వద్ద ఉన్న కేవైసీ వివరాలను బట్టే బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయని వివరించారు.
నాన్ ఫంగీబుల్ టోకెన్స్ (NFTs)కు సంబంధించి ప్రత్యేకమైన చట్టం చేయాలని ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రిప్టో కరెన్సీ రాబడిపై ఎంత మంది పన్నులు చెల్లించారని సభలో ఆయన ప్రశ్నించారు.
Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత
Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!
Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్..! ఆటో బుక్ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?
Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి