By: ABP Desam | Updated at : 01 Dec 2021 03:18 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Money
డిసెంబర్ నెలలో మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఇవి మీ ఆర్థిక లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపించనున్నాయి. డబ్బు పరంగా జరుగుతున్న ఆ ఐదు మార్పులు ఇవే..!
SBI Credit Card EMI Processing Fee । ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఈఎంఐపై రుసుము
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారులు ఇకపై ఈఎంఐ లావాదేవీలపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి ఈఐంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం. వెబ్‌సైట్, ఆన్‌లైన్, ఈ-కామర్స్, నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేసి వాటిని ఈఎంఐగా మార్చుకుంటే రూ.99+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
PNB interest rates । సేవింగ్స్‌పై వడ్డీరేటు తగ్గింపు
పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించింది. దాదాపు పది బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించింది. రూ.10లక్షల కన్నా తక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 10 పాయింట్లు, రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 5 పాయింట్ల మేర కోత పడనుంది. అంటే వార్షికంగా 2.80 నుంచి 2.85 శాతం మేర ప్రభావం ఉంటుంది.
Jeevan Pramaan Patra । లైఫ్ సర్టిఫికెట్ గడువు ముగిసింది
పింఛన్‌దారులు జీవన ప్రమాణ పత్రం దాఖలు చేసే చివరి తేదీ నవంబర్ 30న ముగిసింది. అయితే ఈపీఎఫ్‌వో నుంచి పింఛను పొందే ప్రైవేటు ఉద్యోగులు ధ్రువపత్రం సమర్పించేందుకు గడువు వేరే ఉంటుంది. ఆ గడువు లోపు వీరు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే లబ్ధిదారులకు ప్రయోజనాలు నిలిచిపోతాయి.
UAN-Aadhar Linking । పీఎఫ్- ఆధార్ అనుసంధానం
ఆధార్-ఈపీఎఫ్‌వో అనుసంధానం చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 30తో ముగిసింది. ఒకవేళ మీరు ఆ తేదీలోపు యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో ఆధార సంఖ్య లింక్ అవ్వకపోతే సంబంధిత ప్రయోజనాలు ఈ నెలతో నిలిచిపోతాయి. ఇకపై యజమాని నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ ఆగిపోతుంది. పీఎఫ్‌లోని నిధులును ఉపసంహరించేందుకు వీలుండదు.
ITR Filing । ఆదాయపన్ను దాఖలు
ఆదాయపన్ను దాఖలు (ITR) చేసేందుకు 2021, డిసెంబర్ 31 చివరి తేదీ. గడువులోపు పన్ను వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌కం టాక్స్ కొత్త వెబ్‌సైట్‌లో ఇబ్బందులు ఉండటంతో గడువును ఈ నెలాఖరుకు పెంచారు. ఇలా గడువు పెంచడం ఇది రెండోసారి. కొవిడ్ రెండో వేవ్ వల్ల జులై 31న ముగిసిన గడువును సెప్టెంబర్ 30కి పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచారు.
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Money Saving: జీతం నుంచి నెలవారీ సేవింగ్ - ఈ 7 పద్ధతులు పాటిస్తే మీరే 'కింగ్'
Share Market Today: స్టాక్ మార్కెట్లో బుల్ పరేడ్ - సెన్సెక్స్ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్
Gold-Silver Prices Today 25 Nov: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?