search
×

SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్‌ తెలుసా?

ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నారా? డబ్బులు తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందా? ఈ కొత్త రూల్‌ గురించి తెలుసుకోండి. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

FOLLOW US: 
Share:

కస్టమర్ల డబ్బుకు మరింత రక్షణ కల్పించేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది! ఏటీఎం కార్డు మోసాలకు చెక్‌ పెట్టేందుకు సరికొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకొచ్చింది. ఓటీపీ ద్వారా మరింత భద్రత కల్పిస్తోంది. పదివేల రూపాయాలకు పైబడే లావాదేవీలు చేసేటప్పుడు మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనివల్ల ఇతరులు మీ కార్డును ఉపయోగించలేరు.

'ఎస్‌బీఐ ఏటీఎంల్లో చేసే ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ మోసగాళ్ల నుంచి మీకు వ్యాక్సినేషన్‌ రక్షణ లాంటిది. మిమ్మల్ని మోసాల నుంచి రక్షించడం మాకు అత్యంత కీలకమైన బాధ్యత' అని ఎస్‌బీఐ ఈ మధ్యే ట్వీట్‌ చేసింది. చిన్న వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ ఓటీపీ ఆధారిత మెకానిజం రూ.10వేల కన్నా ఎక్కువ విలువైన లావాదేవీలకే వర్తిస్తుంది. డెబిట్‌ కార్డును ఏటీఎంలో పెట్టిన తర్వాత మీ నమోదిత మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుందని బ్యాంకు తెలిపింది.

ఈ సాంకేతికను ఉపయోగించేటప్పుడు చాలామంది వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది. మొబైల్‌కు వన్‌టైం పాస్వర్డ్‌ రావడం లేదు. ఫలితంగా కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వీరికి ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. ఇకపై రూ.10వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే ఓటీపీ తప్పనిసరని స్పష్టం చేసింది. అందుకే బ్యాంకు ఖాతాకు మొబైల్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని వెల్లడించింది. లేదంటే ఇబ్బందులు తప్పవని అంటోంది. అయితే పదివేల రూపాయల్లోపు విత్‌డ్రా చేస్తే ఓటీపీ అవసరం లేదని చెబుతోంది.

ఇవి పాటించండి

  • మొదట మీ ఏటీఎం కార్డును ఇన్‌సెర్ట్‌ చేసి కావాల్సిన మొత్తాన్ని ఎంటర్‌ చేయండి.
  • రూ.10,000 కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే ఓటీపీ మీ నమోదిత మొబైల్‌కు వస్తుంది.
  • ఆ తర్వాత ఏటీఎంలో ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
  • సింగిల్‌ విత్‌డ్రాయల్‌కు ఓటీపీ వస్తుంది. మళ్లీ రూ.పదివేల కన్నా ఎక్కువే విత్‌డ్రా చేయాలంటే మళ్లీ ఓటీపీ వస్తుంది.

Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?

Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది

Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..

Also Read: Petrol-Diesel Price, 1 December: గుడ్‌న్యూస్, ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..

Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Dec 2021 07:44 AM (IST) Tags: ATM Customers SBI ATM Withdrawal Rule Cash SBI Rule

ఇవి కూడా చూడండి

IPL Bettings: UPI సేవల్లో అంతరాయానికి IPL బెట్టింగులే కారణమా?, - పందేల విలువ లక్షల కోట్లు!

IPL Bettings: UPI సేవల్లో అంతరాయానికి IPL బెట్టింగులే కారణమా?, - పందేల విలువ లక్షల కోట్లు!

Best Mutual Fund SIP: పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే!

Best Mutual Fund SIP: పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే!

Lower Interest Rates: వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్‌లు - SBI FD కష్టమర్లకు షాక్‌!

Lower Interest Rates: వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్‌లు - SBI FD కష్టమర్లకు షాక్‌!

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

టాప్ స్టోరీస్

Chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్

Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్

Supreme Court : టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!

BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!

Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !

Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !