GST Collections: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
నవంబర్ మాసంలో ఏకంగా 25 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్త పన్ను విధానం అమలు చేశాక ఇది రెండో అత్యధిక వసూళ్లు కావడం గమనార్హం.
వస్తు సేవల పన్ను వసూళ్లు రికార్డు సృష్టించాయి. నవంబర్ మాసంలో ఏకంగా 25 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్త పన్ను విధానం అమలు చేశాక ఇది రెండో అత్యధిక వసూళ్లు కావడం గమనార్హం.
'2021, నవంబర్‌లో స్థూల జీఎస్‌టీ రాబడి రూ.1,31,526 కోట్లుగా ఉంది. ఇందులో సీజీఎస్‌టీ రూ.23,978 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.31,127 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.66,815 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్‌టీలో వస్తు దిగుమతి ద్వారా రూ.32,165 కోట్లు కలిసే ఉంది. ఇక సెస్ రూపంలో రూ.9,606 కోట్ల రాబడి వచ్చింది' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వరుసగా ఐదు నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం ఆర్థిక వ్యవస్థ పుంజుకొందని చెప్పేందుకు ఉదాహరణగా వర్ణిస్తున్నారు. 2021, అక్టోబర్లో రాబడి రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2021, ఏప్రిల్‌లో రూ.1,39,708 కోట్ల తర్వాత ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం.
'వస్తు సేవల పన్ను ప్రవేశ పెట్టిన తర్వాత 2021, నవంబర్లో జీఎస్‌టీ రాబడి ఇంత రావడం ఇది రెండోసారి. 2021, ఏప్రిల్‌లో తొలిసారి ఎక్కువగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఏడాది ముగింపు కావడం అప్పుడు దోహదం చేసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో మళ్లీ రాబడి పెరిగింది. జీఎస్‌టీఆర్-1 దాఖలు, దాఖలు ప్రక్రియ మరింత మెరుగవ్వడంతో వసూళ్లు ఊపందుకున్నాయి' అని టాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ భాగస్వామి వివేక్ జలన్ అన్నారు.
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!