Best Electric Cars in 2022: 2022లో భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
2022లో సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారులు సైతం వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏడాది దేశీ భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఈవీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
![Best Electric Cars in 2022: 2022లో భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! Year Ender 2022 Best Electric Cars Launched In India This Year Best Electric Cars in 2022: 2022లో భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/2c04c1679112da1cae84dd85253c3c981672215580853544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పెట్రో ధరల పెంపుకు తోడు, పర్యావరణ హితమైన ప్రయాణంపై వాహనదారుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2022లో EV ప్రీమియం సెగ్మెంట్ లో పలు కార్లు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన బెస్ట్ EVల గురించి ఇప్పుడు చూద్దాం..
టాటా టియాగో EV
టాటా మోటార్స్ EV అమ్మకాల్లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. Nexon EV, Tigor EV మంచి ప్రజాదరణ పొందాయి. Tiago EV దేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కార్లు ఒక్క ఛార్జ్ పై 315 కిలో మీటర్ల రేంజ్ ని అందిస్తున్నాయి.
Mercedes-Benz EQS
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంజ్ విడుదల చేసిన EQS అత్యుత్తమ ఎలక్ట్రిక్ కారుగా చెప్పుకోవచ్చు. EQS 580 ఒక్క ఛార్జ్ కు గరిష్టం 857కి.మీ పరిధిని అందిస్తోంది. లగ్జరీ EV అయినప్పటికీ ఇది స్థానికంగా అసెంబుల్ చేయబడింది. అదిరిపోయే ఇంజిన్ సామర్థ్యంతో పాటు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ఆకట్టుకుంటుంది.
BYD అట్టో 3
BYD అనేది చైనీస్ బ్రాండ్. BYD తొలుత e6 MPVతో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే Atto 3 EV SUVలో తొలికారుగా చెప్పుకోవచ్చు. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. 210bhp తో పాటు 310Nm టార్క్ అందించే మోటారును కలిగి ఉంది. ఒక్క ఛార్జ్ తో 521 కి.మీ పరిధిని అందిస్తోంది.
BMW i4
i4 అనేది ఒక ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్. 340hp శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. i4 ఒక్క ఛార్జ్ తో 590 కి.మీ ప్రయాణిస్తోంది.
కియా EV6
దేశంలో మొట్టమొదటి Kia EV ప్రీమియం, వేగవంతమైన ఎలక్ట్రిక్ SUV. ఇది CBU ద్వారా ఇండియాకు వస్తోంది. EV6 పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ ట్రిమ్‌ను పొందుతోంది. RWD, AWD అనే రెండు కాన్ఫిగరేషన్ లలో వస్తోంది. ఇది 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్క ఛార్జ్ తో 520 కి.మీ పరిధిని అందిస్తోంది.
వోల్వో XC40 రీఛార్జ్
XC40 రీఛార్జ్ అనేది భారత్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన EV. ఇది 78kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 418km పరిధిని అందిస్తోంది. ఈ కారు కేవలం 4.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇంజిన్ డ్యూయల్ మోటార్ లే అవుట్ ను కలిగి ఉంటుంది.
Mercedes-Benz EQB
EQB భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ 7-సీటర్ SUV లగ్జరీ SUV. ఒక్క ఛార్జ్ తో ఈ కారు 423 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. EQB అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.
Read Also: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్ తో 631 కిలో మీటర్లు వెళ్లొచ్చు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)