Hyundai Ioniq 5 SUV: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్ తో 631 కిలో మీటర్లు వెళ్లొచ్చు!
ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో హ్యుందాయ్ సూపర్ డూపర్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఒక్క ఛార్జ్ తో ఏకంగా 631 కి.మీ ప్రయాణించే ఐయోనిక్ 5 SUVని పరిచయం చేసింది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ మొదలయ్యాయి.
దేశీయ వాహన మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు విడుదల అయ్యింది. గతంలో ఏకారుకు లేని కొత్త ఫీచర్లు, రేంజితో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఐయోనిక్ 5 SUV పేరిట వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.ఇ జీఎంపీ ప్లాట్ మీద హ్యుందాయ్ తీసుకొచ్చే బీఈవీలో ఇదే మొట్టమొదటి కారు. 2028 వరకు ఈ కంపెనీ ఆరు మోడళ్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ లేటెస్ట్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ను మొదలు పెట్టింది. కార్ల డెలివరీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు కావాలి అనుకునే వారు రూ. 1 లక్ష చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో అన్‌సూ కిమ్ వెల్లడించారు. ఇంటెలిజెంట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ తో ఈ కారు రూపొందినట్లు తెలిపారు.
ఐయోనిక్ 5 SUV డిజైన్, ఫీచర్లు
ఐయోనిక్ 5 SUV కారు చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. చాలా క్లీన్‌గా షార్ప్ గా కనిపిస్తుంది. ఈ కారు పొడవు 4,635 mm, వెడల్పు 1,890 mm, ఎత్తు 1625mm, వీల్ బేస్ 3,000 mm ఉంటుంది. కారు ఫ్రంట్ భాగంలో పారామెట్రిక్ పిక్సెల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో అదిరిపోయే లుక్ ను కలిగి ఉంది. ఈ కారు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. ఇవి సిగ్నేచర్ పిక్సెల్ డిజైన్ తో రూపొందాయి. కారు లోపలి భాగంలో 12.3 ఇంచుల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ప్రీమియం సౌండ్ సిస్టమ్, లెవెల్ 2 అడాస్ సహా పలు ఫీచర్లు న్నాయి.
ఒక్క ఛార్జ్ తో 631 కి.మీ ప్రయాణం
ఐయోనిక్ 5 SUV కారులోని ఎలక్ట్రిక్ మోటార్ ను పరిశీలిస్తే 217 బీహెచ్‌పీ సమార్థ్యంతో 350 ఎన్ఎం టార్క్ ను కలిగి ఉంటుంది. 72.6 KWH బ్యాటరీ ప్యాకప్ ను కలిగి ఉంది. ఒక్క ఛార్జ్ తో 631 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ కారు బ్యాటరీని 350 KW డీసీ ఫాస్ట్ చార్జర్ తో ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జింగ్ అవుతుంది.
It was a sight to behold at the Gateway of India when #HyundaiIONIQ5 partially powered the magnificent projection with its Vehicle to Load (V2L) feature to announce the opening of bookings.#HyundaiIndia #BeyondMobility #ILoveHyundai #IQNIQ5 #Poweyourworld #ElectrifiedbyIONIQ5 pic.twitter.com/DkVX19lgUd
— Hyundai India (@HyundaiIndia) December 26, 2022
కియా ఈవీ6 మోడల్ కన్నా ధర తక్కువ ఉండొచ్చు!
ఇక తాజాగా మార్కెట్లోకి విడుదలైన కియా ఈవీ6 మోడల్ తో పోల్చితే హ్యుందాయ్ ఐయోనిక్ 5 ధర చౌకగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కియా ఈవీ 6 కారు ధర రూ. 59.95 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ ఈవీ ధర రూ. 50 లక్షల నుంచి రూ. 55 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.
Read Also: మీ కలల లిస్ట్‌లో కొత్త కారు ఉందా? అయితే వచ్చే సంవత్సరం రానున్న బడ్జెట్ కార్లపై లుక్కేయండి!