రెట్రో లుక్, యూత్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే Yamaha XSR155ని కొనాలా? వద్దా?
యమహా XSR155 భారత్‌లో లాంచ్ అయింది. స్టైలిష్ రెట్రో డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఈ బైక్‌ను కొనడానికి 3 కారణాలు, స్కిప్ చేయడానికి 2 లోపాలు తెలుసుకోండి.

Yamaha XSR155 Review: తెలుగు రాష్ట్రాల్లోని యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూసిన యమహా XSR155 ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఇది మన దేశంలో అమ్మకానికి వచ్చిన అత్యంత చౌకైన లిక్విడ్ కూల్డ్ యమహా మోటార్‌సైకిల్ కావడం విశేషం. ఇప్పటికే ఈ బైక్‌ను రైడ్ చేసిన ఎక్స్‌పర్ట్‌లు, ఇది కంటికి కనిపించినంత చక్కగా రైడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇస్తుందని చెబుతున్నారు. అయితే, ప్రతి బైక్‌లాగే దీనికీ కొన్ని బలాలు, కొన్ని లోపాలు ఉన్నాయి. యమహా XSR155 కొనాలంటే ఏ విషయాలు మీకు ప్లస్‌గా ఉంటాయి? ఏవి మైనస్‌గా మారుతాయి?.
యమహా XSR155 కొనడానికి కారణాలు
1. ఆకట్టుకునే రెట్రో స్టైల్
యమహా XSR155ను ఎంచుకునే ప్రధాన కారణం దీని హ్యాండ్సమ్ డిజైన్. సింపుల్, క్లీన్ లైన్స్‌తో రూపొందించిన ఈ బైక్ క్లాసిక్ రెట్రో లుక్‌ను స్పష్టంగా చూపిస్తుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర 155cc బైక్‌లతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్పోర్టీ లుక్ ఉన్న R15, MT-15తో పోలిస్తే XSR155 ఒక ఎలిగెంట్, టైమ్‌లెస్ డిజైన్‌ను అందిస్తుంది. మొత్తం బైక్‌పై ఫిట్, ఫినిష్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటాయి.
2. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మంచి మైలేజ్
యమహా 155cc ఇంజిన్ సిరీస్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. పెర్ఫార్మెన్స్ తగ్గకుండా మైలేజ్ కూడా ఇవ్వగల సామర్థ్యం చాలా తక్కువ బైక్‌ల్లోనే ఉంటుంది. XSR155లో కూడా ఈ తక్కువ బైకుల్లో ఒకటి. నగర రైడింగ్‌లోనూ, హైవే ప్రయాణాల్లోనూ ఇది షార్ప్ రెస్పాన్స్ ఇస్తుంది. టెస్ట్ రైడ్స్‌లో ఈ మోటార్ సైకిల్ మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో పాటు స్ట్రాంగ్ పికప్‌ను చూపించింది.
3. విశాలమైన రైడింగ్ పొజిషన్
చిన్న కెపాసిటీ బైక్‌లు సాధారణంగా పొడవైన లేదా బరువైన రైడర్లకు కంఫర్ట్‌గా ఉండవు. కానీ యమహా XSR155లో రైడింగ్ పొజిషన్ చాలా స్పేసియస్‌గా ఉంటుంది. దీని సిబ్లింగ్స్‌తో పోలిస్తే కూర్చునే విధానం చాలా సహజంగా ఉంటుంది. అందువల్ల పొడవైన రైడర్లు కూడా ఇబ్బంది లేకుండా లాంగ్ రైడ్స్ చేయవచ్చు.
యమహా XSR155 కొనకుండా ఆగడానికి కారణాలు
1. బ్యాడ్ రోడ్లపై సస్పెన్షన్ కంఫర్ట్
XSR155, R15 & MT-15లతో ఒకే ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. అందువల్ల వీటి లాగే దీని సస్పెన్షన్ సెటప్ కూడా కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. మంచి రోడ్లపై ఈ బైక్ స్టేబిలిటీ ఇస్తుంది, కానీ చెడు రోడ్లు, వరుస గుంతలు ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ నేరుగా రైడర్ వెన్నెముకకు తగుతులుతుంది. రోజూ గుంతల రోడ్లపై ప్రయాణించే వారికి ఇది అసౌకర్యంగా మారొచ్చు.
2. స్విచ్‌గియర్ మెరుగుదల అవసరం
మొత్తంగా బైక్ క్వాలిటీ బాగానే ఉన్నా, స్విచ్‌గియర్ మాత్రం కొంచెం బడ్జెట్ ఫీల్ ఇస్తుంది. హై బీమ్ ఫ్లాష్ కోసం ఉన్న రాకర్ స్టైల్ బటన్ యూజ్ చేయడానికి సౌకర్యంగా ఉండదు. హారన్, ఇండికేటర్ బటన్‌ల పొజిషన్ కూడా సహజంగా అనిపించదు.
తుది మాట
యమహా XSR155 ఒక స్టైలిష్, రెట్రో లుక్ కోరుకునే రైడర్లకు, మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్ కావాలనుకునే వారికి సరైన ఎంపిక. అయితే బ్యాడ్ రోడ్లపై ఎక్కువగా ప్రయాణించే వాళ్లు లేదా పూర్తిగా కంఫర్ట్‌ను కోరుకునేవాళ్లు ఇతర ఆప్షన్లను కూడా పరిశీలించడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















