అన్వేషించండి

టాటా పంచ్‌ EV ఫేస్‌లిఫ్ట్‌ కొనాలా? - ప్లస్‌లు, మైనస్‌లపై ఫుల్‌ రివ్యూ తెలుసుకోండి

టాటా పంచ్‌ EV ఫేస్‌లిఫ్ట్‌ మెరుగైన రేంజ్‌, ఫీచర్లతో వచ్చింది. ఏపీ, తెలంగాణలో ధరలు ఎలా ఉన్నాయ్‌? కొనాలా వద్దా? 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు వివరంగా తెలుసుకోండి.

Tata Punch EV Facelift: టాటా మోటార్స్‌, తన చిన్న ఎలక్ట్రిక్‌ SUV అయిన టాటా పంచ్‌ EVకు ఇటీవలే ఫేస్‌లిఫ్ట్‌ తీసుకొచ్చింది. ఇది ఈ మోడల్‌కు వచ్చిన మొదటి పెద్ద అప్‌డేట్‌. కొత్త బ్యాటరీ ఆప్షన్‌లు, మెరుగైన స్టైలింగ్‌, వేగంగా ఛార్జింగ్‌తో పాటు "తగ్గించిన ప్రారంభ ధర"తో మార్కెట్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో టాటా పంచ్‌ EV ఫేస్‌లిఫ్ట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు ‍‌(వేరియంట్‌ను బట్టి) ఉంది. ఆన్‌-రోడ్‌ ధర సుమారు రూ. 10.20 లక్షల నుంచి రూ. 13.39 లక్షల వరకు ఉంటుంది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

ఇప్పుడు ఈ కారును కొనాలా? లేక వేరే ఆప్షన్‌ చూడాలా? మీకు క్లారిటీ కోసం 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు.

కొనడానికి 3 బలమైన కారణాలు

1. స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవం

పంచ్‌ EVలో ముందు భాగంలో సింగిల్‌ మోటార్‌ ఉంది. ఇది 30kWh, 40kWh బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. చిన్న బ్యాటరీ వేరియంట్‌ 88hp శక్తి, పెద్ద బ్యాటరీ వేరియంట్‌ 129hp శక్తి ఇస్తుంది. రెండు వేరియంట్‌ల్లో కూడా 154Nm టార్క్‌ అందుతుంది.

పవర్‌ డెలివరీ చాలా సాఫీగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేయడం సులభంగా అనిపిస్తుంది. Eco, City, Sport అనే మూడు డ్రైవ్‌ మోడ్‌లు ఉన్నాయి. Eco మోడ్‌లో రేంజ్‌ ఎక్కువగా వస్తుంది. City మోడ్‌ డైలీ యూజ్‌కు సరైనది. Sport మోడ్‌లో యాక్సిలరేషన్‌ మరింత షార్ప్‌గా ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ కారు కాబట్టి ఇంజిన్‌ శబ్దం ఉండదు. క్యాబిన్‌లో నిశ్శబ్దం బాగుంటుంది.

2. సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లు

పైన వేరియంట్‌ల్లో 10.25 ఇంచ్‌ హార్మన్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ చేస్తుంది. 360 డిగ్రీ కెమెరా, వాయిస్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్‌ డ్రైవర్‌ డిస్ప్లే కూడా 10.25 ఇంచ్‌ సైజ్‌లో ఉంటుంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, సన్‌రూఫ్‌ వంటి కంఫర్ట్‌ ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవర్‌ సహా ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS తో EBD, ESP, హిల్‌ హోల్డ్‌ అసిస్టు, ISOFIX మౌంట్స్‌ బేస్‌ వేరియంట్‌ నుంచే అందిస్తారు.

3. కంఫర్ట్‌ రైడ్‌ & స్థిరమైన హ్యాండ్లింగ్‌

సిటీ రోడ్లలో గుంతలు, బంప్స్‌ వచ్చినా సస్పెన్షన్‌ బాగా హ్యాండిల్‌ చేస్తుంది. బ్యాటరీ బరువు ఉన్నప్పటికీ కారు స్థిరంగా ఉంటుంది.

స్టీరింగ్‌ లో-స్పీడ్‌లో లైట్‌గా ఉంటుంది. హై-స్పీడ్‌లో స్థిరత్వం కనిపిస్తుంది. రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ నాలుగు లెవెల్స్‌లో అడ్జస్ట్‌ చేయొచ్చు.

స్కిప్‌ చేయడానికి 2 కారణాలు

1. వెనుక సీటు స్పేస్‌ పరిమితం

వెనుక సీటు ఇద్దరు పెద్దవాళ్లకు చక్కగా సరిపోతుంది. కానీ ముగ్గురు కూర్చుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వెనుక AC వెంట్స్‌ లేవు. ఇది కొంతమందికి మైనస్‌గా అనిపించొచ్చు.

2. స్పేర్‌ టైర్‌ లేదు

పంచ్‌ EVలో స్పేర్‌ వీల్‌ ఇవ్వరు. పంక్చర్‌ రిపేర్‌ కిట్‌ మాత్రమే ఉంటుంది. చిన్న పంక్చర్‌ అయితే ఈ కిట్‌ సరిపోతుంది. కానీ పెద్ద డ్యామేజ్‌ అయితే కాస్త ఇబ్బందే, ప్రత్యేకంగా లాంగ్‌ ట్రిప్‌ల్లో ఇది సమస్య కావచ్చు.

మొత్తానికి, టాటా పంచ్‌ EV ఫేస్‌లిఫ్ట్‌ మంచి రేంజ్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఇస్తుంది. సిటీ యూజ్‌ కోసం ఇది సరైన ఎలక్ట్రిక్‌ ఆప్షన్‌. అయితే వెనుక స్పేస్‌, స్పేర్‌ టైర్‌ లేని విషయం గుర్తుంచుకోవాలి. 

మీరు ఏపీ లేదా తెలంగాణలో మొదటి ఎలక్ట్రిక్‌ కారు కొనాలని చూస్తే, ఈ పంచ్‌ EV ఒక మంచి ఎంపికగా పరిగణించొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget