Royal Enfield Bullet Standard Black, Black Gold మధ్య తేడా ఏంటి? టైర్ల అప్‌గ్రేడ్‌పై నిజం ఇదే
Royal Enfield Classic 350 Halcyon Black, Bullet 350 Standard Black, Bullet 350 Black Gold లో ఏది కొనడం సరైన నిర్ణయం? ఫీచర్స్, మోడిఫికేషన్స్, టైర్ సైజ్ అప్‌గ్రేడ్‌పై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Royal Enfield 350cc Motorcycles: Royal Enfield Classic 350 Halcyon Black, Bullet 350 Standard Black, Bullet 350 Black Gold - ఈ మూడు బైక్‌ల మధ్య ఒక బండిని ఎంపిక చేయడం చాలామందికి గందరగోళంగా మారింది. ముఖ్యంగా రెండు Bullet వేరియంట్ల మధ్య అసలు తేడా ఏమిటి? ఏది డబ్బుకు సరైన వాల్యూ ఇస్తుంది? అనే సందేహం సహజమే. ముందుగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకోవాలి.
Classic 350, Bullet 350 - బేస్ ఒకటే
రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350, Bullet 350 రెండూ మెకానికల్‌గా ఒకే తరహా బైక్స్. సేమ్ J-సిరీస్ ఇంజిన్, సేమ్ ఛాసిస్, సేమ్ రైడింగ్ ఫీల్ ఇస్తాయి. అంటే మీరు ఏ మోడల్ ఎంచుకున్నా రైడింగ్ అనుభవంలో పెద్ద తేడా ఉండదు. అసలు తేడా లుక్, ఫీచర్లు, ఫినిషింగ్, బ్రేక్ సెటప్‌లోనే ఉంటుంది.
Classic 350 Halcyon Black: ఎవరికి సరిపోతుంది?
Classic 350 Halcyon Black బేస్ వేరియంట్ కంటే కొంచెం పై స్థాయిలో ఉంటుంది. ఇందులో....
- రియర్ డ్రమ్ బ్రేక్
- సింగిల్ ఛానల్ ABS
- సింపుల్ మిర్రర్లు
- సాధారణ రియర్ బ్రేక్ పెడల్
- హాలోజెన్ హెడ్‌ల్యాంప్‌తో పైలట్ లైట్స్
ఇస్తారు. లుక్ పరంగా ఇది క్లాసిక్, మినిమలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. తక్కువ ఖర్చుతో Classic అనుభవం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
Bullet 350 Standard Black & Black Gold: అసలు తేడా ఇదే
Bullet 350 Standard Black, Bullet 350 Black Gold రెండూ హైయ్యర్ వేరియంట్లు. వీటిలో....
- రియర్ డిస్క్ బ్రేక్
- డ్యూయల్ ఛానల్ ABS
- క్రోమ్ మిర్రర్లు
- మెరుగైన ఫినిషింగ్ ఉన్న రియర్ బ్రేక్ పెడల్
- కొంచెం ప్రీమియం ఫీల్
ఉంటాయి. మెకానికల్‌గా ఈ రెండు వేరియంట్ల మధ్య ఎలాంటి తేడా లేదు.
Standard Black వేరియంట్ - క్రోమ్ ఫినిషింగ్ ఎక్కువగా ఉంటుంది.
Black Gold వేరియంట్ - బ్లాక్ పౌడర్ కోటెడ్ ఫినిషింగ్‌తో, గోల్డ్ పిన్‌స్ట్రిప్స్‌తో మరింత అగ్రెసివ్, మోడర్న్ లుక్ ఇస్తుంది.
మీకు క్లాసిక్ క్రోమ్ లుక్ నచ్చితే Standard Black & డార్క్, మస్కులర్ స్టైల్ కావాలంటే Black Gold సరైన ఎంపిక.
ఏమేం మోడిఫికేషన్స్ చేయొచ్చు?
ఈ మూడు బైక్‌లకు మీరు సేఫ్‌గా చేసుకునే మోడిఫికేషన్స్ ఇవి:
- టూరింగ్ సీట్ లేదా కుషన్ సీట్
- హై లేదా లో రైజ్ హ్యాండిల్‌బార్
- ఇంజిన్ గార్డ్స్
- సుమ్ప్ గార్డ్
- లగేజ్ ర్యాక్
- టూరింగ్ విండ్స్‌క్రీన్
- LED ఇండికేటర్లు (RTO నియమాల ప్రకారం)
ఇవన్నీ రైడింగ్ కంఫర్ట్‌ను పెంచుతాయి, బైక్ బ్యాలెన్స్‌ను చెడగొట్టవు.
టైర్ సైజ్ అప్‌గ్రేడ్: నిజం ఏమిటి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇచ్చే స్టాక్ టైర్ సైజ్‌లను మార్చకపోవడం ఉత్తమం. కంపెనీ సూచించిన సైజ్‌తోనే బైక్ ఛాసిస్ బ్యాలెన్స్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, మైలేజ్ అన్నీ సరిగ్గా ఉంటాయి.
వెడల్పైన టైర్లు బిగిస్తే...
- మైలేజ్ తగ్గుతుంది
- హ్యాండ్లింగ్ మారుతుంది
- స్టెబిలిటీపై ప్రభావం పడుతుంది
చాలా మంది గరిష్టంగా స్టాక్ కంటే 10 మిల్లీమీటర్లు ఎక్కువ వరకు మాత్రమే మారుస్తారు. అది తప్పనిసరి అవసరం కాకపోతే మార్చకుండా ఉండడమే మంచిది.
ఏది బెస్ట్ ఆప్షన్?
తక్కువ ఖర్చుతో Classic లుక్ కావాలంటే - Classic 350 Halcyon Black
ఫుల్ సేఫ్టీ, డిస్క్ బ్రేక్, ప్రీమియం ఫీల్ కావాలంటే - Bullet 350 Standard Black
డార్క్, మస్కులర్ లుక్ ఇష్టమైతే - Bullet 350 Black Gold
రైడింగ్ అనుభవం మూడు బైక్‌లలో ఒకేలా ఉంటుంది. కాబట్టి చివరికి మీ లుక్ ప్రిఫరెన్స్, ఫీచర్ల అవసరం ఆధారంగా నిర్ణయం తీసుకుంటే చాలు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.



















