కంఫర్ట్ కావాలా? స్పీడ్ కావాలా? Burgman Street - TVS Ntorq మధ్య తేడాలు ఇవే!
Suzuki Burgman Street EX, TVS Ntorq టాప్ మోడళ్లలో ఏది కొనాలి? దీర్ఘకాల నమ్మకం, కంఫర్ట్, రైడింగ్ ఈజ్, మెయింటెనెన్స్ ఖర్చులు, పనితీరు పోలికలను సింపుల్‌గా తెలుసుకోండి.

Best Scooter For Adults: వయసు 45 ఏళ్లు పైబడి, బరువు సుమారు 85 కిలోలు ఉన్న వ్యక్తులు స్కూటర్ కొనే విషయంలో కాస్త ఆలోచించాలి. వయస్సుతో పాటు, ఆఫ్టర్ సేల్ సర్వీస్‌ను కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రొఫైల్ వ్యక్తులకు Suzuki Burgman Street EX టాప్ మోడల్, TVS Ntorq టాప్ మోడల్ సరిపోతాయి. అయితే, ఈ రెండు స్కూటర్ల ఎంపిక విషయంలో క్లారిటీ కావాలంటే ఈ కంపారిజన్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది,
దీర్ఘకాల నమ్మకం & విశ్వసనీయత
సుజుకి బ్రాండ్‌కు భారతదేశంలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ - 'నమ్మకం'. Burgman Street EX ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా మార్కెట్‌లో ఉంది. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రికల్స్ పరంగా దీర్ఘకాలంగా పెద్ద సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. ఫ్యామిలీ యూజ్‌కు సరిపోయే స్కూటర్‌గా దీని పేరు బలంగా నిలిచింది.
TVS Ntorq పెర్ఫార్మెన్స్ షార్ప్‌గా ఉన్నప్పటికీ, దీర్ఘకాల వినియోగంలో రైడర్ల అనుభవాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని సర్వీస్ సెంటర్లలో మంచి అనుభవం ఉంటే, మరికొన్నిచోట్ల ఆఫ్టర్ సేల్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మీకు నమ్మకం అత్యంత ముఖ్యమైతే Burgman ఇక్కడ ముందంజలో ఉంటుంది.
కంఫర్ట్ & రైడింగ్ పొజిషన్
45+ ఏజ్‌లో ఉండి, సుమారు 85 కిలోల బరువు, దాదాపు 5.9 అడుగుల ఎత్తు ఉన్నవాళ్లకు Burgman Street EX మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. ఫుట్‌బోర్డ్ పెద్దగా ఉంటుంది, సీట్ వెడల్పుగా ఉంటుంది, బ్యాక్‌రెస్ట్ సపోర్ట్ కూడా మంచి ప్లస్. లాంగ్ రైడ్స్‌లో నడుము, మోకాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
Ntorqలో రైడింగ్ పొజిషన్ కొంచెం స్పోర్టీగా ఉంటుంది. తక్కువ దూరం రైడ్స్‌కు ఇది బాగుంటుంది కానీ, ఎక్కువ దూరం ప్రయాణాల్లో కొందరికి అలసట అనిపించవచ్చు.
ఈజ్ ఆఫ్ రైడింగ్
ట్రాఫిక్‌లో, రోజువారీ పనుల కోసం Burgman నడపడం చాలా ఈజీగా అనిపిస్తుంది. స్మూత్ పవర్ డెలివరీ, సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల ఇది ప్రశాంతమైన రైడ్ ఇస్తుంది.
Ntorqలో థ్రాటిల్ రెస్పాన్స్ షార్ప్‌గా ఉంటుంది, బాణంలా దూసుకుపోతుంది. స్పీడ్ ఇష్టపడేవారికి ఇది ప్లస్ అయినా, ప్రశాంతంగా నడపాలనుకునే వారికి కొంచెం దూకుడుగా అనిపించవచ్చు.
మెయింటెనెన్స్ ఖర్చులు
సుజుకి స్కూటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు సాధారణంగా మీ బడ్జెట్ కంట్రోల్‌లోనే ఉంటాయి. స్పేర్ పార్ట్స్ ధరలు కూడా ఎక్కువగా ఉండవు.
TVS Ntorqలో సర్వీస్ ఖర్చులు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, ముఖ్యంగా స్పోర్ట్ స్టైల్‌లో నడిపితే టైర్లు, బ్రేక్ పార్ట్స్ త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది.
పనితీరు & మైలేజ్
పనితీరులో TVS Ntorq స్పష్టంగా ముందుంటుంది. పికప్, టాప్ ఎండ్ పవర్ విషయంలో ఇది స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. అదే సమయంలో మైలేజ్ కొంచెం తగ్గుతుంది.
Burgman Street EX పనితీరు సాఫ్ట్‌గా ఉంటుంది. వేగం కంటే స్మూత్‌నెస్, మంచి మైలేజ్‌పై ఫోకస్ చేస్తుంది.
ఏది సరైన ఎంపిక?
మీ వయసు, కంఫర్ట్, ప్రశాంతమైన రైడింగ్, దీర్ఘకాల నమ్మకం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల దృష్ట్యా చూస్తే Suzuki Burgman Street EX టాప్ మోడల్ మీకు మరింత సరైన ఎంపికగా అనిపిస్తుంది.
స్పీడ్, స్పోర్టీ రైడింగ్, థ్రిల్‌ను మీరు కోరుకుంటే మాత్రం TVS Ntorq వైపు చూడొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















