(Source: ECI/ABP News/ABP Majha)
Xiaomi SU7 Electric: ఈవీ కార్‌తో ఆటో సెక్టార్‌లో షావోమి సంచలనం, 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు - త్వరలోనే ఇండియాకి!
Xiaomi SU7: ఎలక్ట్రానిక్స్ రంగంలో దూసుకుపోతున్న షావోమి ఆటో సెక్టార్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది.
Xiaomi SU7 Electric Car: ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తయారీలో దూసుకుపోతున్న షియామీ కంపెనీ ఆటోమొబైల్ రంగంలోనూ అడుగు పెట్టింది. అప్పుడే ఓ కార్‌ని కూడా తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇప్పటికే ఈ కార్‌పై ఆసక్తి పెరిగింది. ఇండియాలో బెంగళూరులో ఈ కార్‌ని ప్రదర్శించనుంది. నేరుగా ఎలక్ట్రిక్ కార్‌తోనే మార్కెట్‌లోకి దిగింది షియామీ కంపెనీ. Xiaomi SU7 Electric పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ కార్ అక్కడ టెస్లాకే గట్టి పోటీ ఇస్తోంది. ఆ స్థాయిలో డిమాండ్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న Tesla Model 3 కార్‌నే వెనక్కి నెట్టింది. చైనాలో దీని ధర 2,15,900 యువాన్‌లు. అంటే మన కరెన్సీలో రూ.25 లక్షలు. జులై 9వ తేదీన బెంగళూరులో ఈ కార్‌ని ( Xiaomi SU7 Electric Features) ఎగ్జిబిట్ చేయనున్నారు. మరి ఈ కార్‌ని ఇండియాలో లాంఛ్ చేస్తారా అని అడిగితే "ప్రస్తుతానికేతై ఆ ఆలోచన లేదు" అని తేల్చి చెప్పింది సంస్థ. అయినా ఇండియాలో మాత్రం ఈ కార్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇండియన్ మార్కెట్‌లో షావోమి అడుగు పెట్టి పదేళ్లవుతోంది. ఈ సందర్భంగానే స్పెషల్‌గా భారత్‌లో కార్‌ని ప్రదర్శిస్తున్నట్టు చెప్పింది సంస్థ. పైగా భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. అందుకు ఇండియా మార్కెట్ ఎంతో కీలకమని భావిస్తోంది. ప్రస్తుతానికైతే ఇండియాలో షావోమికి స్మార్ట్‌ఫోన్‌ల బిజినెస్ గట్టిగానే ఉంది. భవిష్యత్‌లో మిగతా ప్రొడక్ట్స్‌కీ ఇదే స్థాయిలో డిమాండ్ తెచ్చుకోవాలని చూస్తోంది షియామీ కంపెనీ.
ప్రీమియం SUVగా మార్కెట్‌లోకి వచ్చిన Xiaomi SU7 కార్‌కి చైనాలో 24 గంటల్లోనే లక్ష ఆర్డర్లు వచ్చాయి. 5 మీటర్ల పొడవుతో ఈ ప్రీమియం సెడాన్‌కి టాప్ ఎండ్ వర్షన్ కూడా ఉంది. ఈ మోడల్‌లో డ్యుయల్ మోటర్స్ ఇస్తోంది. 101KWH బ్యాటరీతో 800 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలిగేలా దీన్ని డిజైన్ చేశారు. అన్నింటికన్నా ముందు ఎక్స్‌టీరియర్ అందరినీ ఆకట్టుకునేలా చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో ప్రదర్శించి ఆ తరవాత మార్కెట్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Hyundai Ioniq 5, BYD Seal కార్‌ల ధరల రూ.40 లక్షల వరకూ ఉంది. దాదాపు ఈ ధరతో సమానంగా భారత్‌లో విక్రయించే అవకాశాలున్నాయి. డ్యుయల్ మోటర్ వర్షన్ ఇంకాస్త ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇప్పటికైతే అంత భారీ ధరతో కాకుండా నష్టాలకే అమ్ముకుంటోంది. ముందు మార్కెట్‌లో నిలదొక్కుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇండియాలో ఈవీ మార్కెట్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇలాంటి సమయంలో షావోమి కార్ అందుబాటులోకి వస్తే మంచి డిమాండ్‌ని సాధించే అవకాశముంది. ఇప్పటికి ఇండియాలో ప్రీమియ్ వర్షన్‌లో ఈవీ కార్లు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి బాగానే మార్కెట్ ఉంటోంది కూడా. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అందుకే ఇండియన్ కార్ మార్కెట్‌ని పరిశీలిస్తోంది షావోమి. సరైన టైమ్‌లో ఇక్కడ పాగా వేసే ఆలోచనలో ఉంది.