అన్వేషించండి

Diwali Car Sales: దీపావళి పండుగ ముందు కొత్త కార్ల బుకింగ్స్‌ అకస్మాత్తుగా ఎందుకు ఆగాయి? GST 2025 సంస్కరణలే కారణమా?

New Car Bookings 2025: దీపావళికి ముందు భారతదేశంలో కార్ బుకింగ్స్‌ అకస్మాత్తుగా ఆగిపోయాయి. కస్టమర్లు వెనుకడుగు వేయడానికి అసలు కారణం ఏంటి?.

GST Reforms 2025 Impact On New Car Bookings: ఇప్పుడు, ఇండియన్‌ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది. కొత్త GST కోతల ఆశతో, కొత్త కారు కొనుగోలుదార్ల తమ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు/ వాయిదా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను (GST) రేట్లను తగ్గిస్తే, కార్లు మునుపటి కంటే చౌకగా మారుతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ఆశ కారణంగా, కొత్త కారు కొనాలనుకుంటున్న కస్టమర్లు "వేచి చూద్దాం" అనే ధోరణిలో ఉన్నారు.

బుకింగ్స్‌పై ప్రభావం
డీలర్‌షిప్‌లలో వాహనాల గురించి విచారణలు ఖచ్చితంగా పెరిగాయి, కానీ బుకింగ్స్‌ బాగా తగ్గాయి. ఎంట్రీ లెవల్ కార్లు & ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు, సరైన సమయం (GST సంస్కరణల ప్రకటన) కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం 28% పన్ను పరిధిలో ఉన్న చిన్న కార్లు GST రేట్ల తగ్గింపు తర్వాత 18% పరిధిలోకి దిగి రావచ్చు. మరోవైపు, SUVలపై పన్ను 45% నుంచి 40% కు తగ్గే అవకాశం ఉంది. ఇది వాహనాల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, ట్యాగ్‌ ప్రైస్‌ బాగా తగ్గి కస్టమర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

కార్ల ధరలు ఏ మాత్రం తగ్గవచ్చు?
GST రేట్లు తగ్గిస్తే... Maruti Wagon R, Maruti Baleno, Hyundai Creta & Mahindra Scorpio N వంటి పాపులర్‌ వెహికల్స్‌ బాగా చౌకగా మారవచ్చు. చిన్న కార్ల ధరలు దాదాపు రూ. 60,000 తగ్గుతాయని అంచనా. అదే సమయంలో, SUVల ధరలు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ తగ్గవచ్చు. ఇది, కార్‌ లోన్‌ తీసుకునే కొనుగోలుదారుల EMI ని కూడా తగ్గిస్తుంది & కారు కొనుగోలు చేయడాన్ని మునుపటి కంటే సౌలభ్యంగా మారుస్తుంది. 

కార్ల కంపెనీల ఆందోళన
నిజానికి, ఈ పరిస్థితి కార్ల కంపెనీల ఆందోళనలు పెంచింది. వాస్తవానికి, ఆటో రంగానికి ఈ పండుగ సీజన్‌ (దసరా, ఓనమ్‌, దీపావళి పండుగల సమయం) ఒక పీక్‌ టైమ్‌. ఏడాది మొత్తం జరిగే విక్రయాల్లో మెజారిటీ సేల్స్‌ ఈ ఫెస్టివ్‌ సీజన్‌లోనే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం పన్ను GST రేట్లను తగ్గిస్తుందన్న ఆశతో వినియోగదారులు ఇప్పుడు కార్లు కొనడానికి దూరంగా ఉన్నారు, ఈ కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయి. 

పండుగ సీజన్ & కార్పొరేట్ వ్యూహం
వాస్తవానికి, ఈ పండుగ సీజన్ కారు కొనడానికి ఉత్తమ సమయంగా మారే అవకాశం ఉంది. GST గురించి గందరగోళం కారణంగా సీజన్‌ ప్రారంభం కొంచెం బలహీనంగా ఉంది. దీంతో, కంపెనీలు, ఇప్పుడు, కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లు & ప్రత్యేక ఆఫర్లను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. 

సెప్టెంబర్ 3 & 4 తేదీల్లో న్యూదిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ‍‌(GST Council meeting) జరగనుంది. కార్లపై పన్ను రేట్లు తగ్గించాలా, వద్దా అనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం, వినియోగదారులు వేచి ఉన్నారు & మార్కెట్‌ కాస్త డల్‌గా ఉంది. పన్ను తగ్గించాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం నిర్ణయిస్తే అది ఆటో రంగంలో కొత్త ఉత్సాహం నింపుతుంది. & కస్టమర్ల రద్దీతో షోరూమ్‌లు మళ్లీ కళకళలాడతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Embed widget