అన్వేషించండి

TVS King Kargo HD EV లాంచ్ - ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఎలక్ట్రిక్‌ ఆటో!

TVS King Kargo HD EV తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ అయింది. తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చేలా రూపొందించబడిన ఈ EV ఆటో డ్రైవర్లకు పెద్ద బెనిఫిట్‌ ఇవ్వనుంది.

TVS King Kargo HD EV Price, Range And Features Telugu: మన దేశంలో, రోజురోజుకూ ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ పెరుగుతోంది. కార్లు, బైకుల వంటి వ్యక్తిగత వాహనాల్లోనే కాదు.. కార్గో, లాస్ట్‌ మైల్‌ డెలివరీ రంగంలో డీజిల్‌, పెట్రోల్‌ ఆటోలు క్రమంగా ఎలక్ట్రిక్‌ ఆటోలకు మారిపోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ వేవ్‌లో, TVS మోటార్‌ కంపెనీ, కొత్తగా "TVS కింగ్‌ కార్గో హెచ్‌డీ ఈవీ"ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

శక్తిమంతమైన బ్యాటరీ, లాంగ్‌ రేంజ్‌
ఈ కొత్త TVS King Kargo HD EV ఆటోలో 10.24 kWh లిథియమ్‌-ఐయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. ఒకసారి పూర్తి చార్జ్‌ చేస్తే 150 కి.మీ. వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కార్గో అవసరాలకు సరిపోయేలా ఈ ఆటోను ప్రత్యేకంగా రూపొందించారు. అంటే, రోజంతా సరుకు రవాణా చేసే వాళ్లకు మళ్లీ మళ్లీ చార్జింగ్‌ అవసరం ఉండదు.

భారీ లోడ్‌ సామర్థ్యం
TVS కింగ్‌ కార్గో హెచ్‌డీ EV ప్రధాన బలం దాని లోడ్‌ క్యాపాసిటీ. దాదాపు 500 కిలోల వరకు సరుకును ఈ ఆటో తీసుకెళ్లగలదు. ఈ బండి గ్రౌండ్ క్లియరెన్స్ 235 mm కాబట్టి, ఎగుడుదిగుడు రోడ్లపై కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది. 703 mm లోడింగ్ ప్లాట్‌ఫామ్ కారణంగా పెద్ద పరిమాణంలో కార్గోను లోడ్‌ చేయవచ్చు. మరో హైలైట్‌ ఏమింటంటే, అంతేకాక, TVS కింగ్‌ కార్గో హెచ్‌డీ EV కి 500 mm వాటర్ ఫోర్డింగ్ సామర్థ్యం ఉంది. దీని అర్ధం.. వర్షాకాలంలో నీళ్లతో నిండిన రోడ్లపై కూడా ఈ ఎలక్ట్రిక్‌ ఆటోను ధైర్యంగా నడపవచ్చు. హోల్‌సేల్‌ మార్కెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఈ-కామర్స్‌ డెలివరీ పార్టనర్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో ఒక పెద్ద అదనపు సౌలభ్యం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య అవసరాల కోసం మంచి ఎంపిక అవుతుంది.

తక్కువ ఆపరేటింగ్‌ ఖర్చులు
డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్‌ ఆటో నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. ఒక్క కిలోమీటర్‌ నడపడానికి 80 పైసల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ వెల్లడించింది. అంటే డ్రైవర్‌లకు, ఓనర్లకు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర వివరాలు
TVS కింగ్‌ కార్గో హెచ్‌డీ EV ను తెలుగు రాష్ట్రాల్లో లాంచ్‌ చేయలేదు. తొలి విడతలో, దిల్లీ -NCR, బెంగళూరు, రాజస్థాన్‌లో మాత్రమే అమ్ముతోంది. ఆ తర్వాత క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సేల్స్‌ ప్రారంభిస్తుంది. TVS కింగ్‌ కార్గో హెచ్‌డీ EV ధర రూ. 3.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). బడ్జెట్‌ ధర కావడం వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆఫర్‌ అవుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే ఆస్కారం ఉంది.

డ్రైవర్‌ కంఫర్ట్‌ & డిజైన్‌
ఈ బండిలో, డిజైన్‌ పరంగా కూడా కొత్త తరహా మార్పులు జరిగాయి. విశాలమైన క్యాబిన్‌, సాఫ్ట్‌ సీటింగ్‌, రోల్‌-ఔట్‌ విండోలు, తేలికైన హ్యాండ్లింగ్‌తో డ్రైవర్‌కు లాంగ్‌ జర్నీల్లోనూ కంఫర్ట్‌గా ఉంటుంది. LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు కారణంగా రాత్రి వేళ ప్రయాణాల్లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. డిజిటల్‌ డిస్‌ప్లే, స్మార్ట్‌ ఫీచర్లు ఉండటం వలన మోడ్రన్‌ కారును నడుపుతున్న ఫీలింగ్‌ వస్తుంది. మన దేశంలో, బ్లూటూత్‌ కనెక్టివిటీతో వచ్చిన తొలి త్రీ-వీలర్‌ ఇదే. TVS కనెక్ట్‌ ఫ్లీట్‌ దీనికి అదనపు ఆకర్షణ, దీనితో కార్గో డెలివెరీలను ఈజీగా నిర్వహించవచ్చు.

వాణిజ్య రంగంలో మార్పు
TVS King Kargo HD EV లాంచ్‌తో వాణిజ్య రవాణా రంగం మరింత వేగంగా ఎలక్ట్రిక్‌ వైపు అడుగులు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లాస్ట్‌ మైల్‌ డెలివరీ సర్వీసులు, పండ్లు/కూరగాయల మార్కెట్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు ఈ వాహనాన్ని విస్తృతంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget