Volkswagen Taigun: హైదరాబాద్‌లో మోస్ట్ అవైటెడ్ కార్ ప్రివ్యూ.. వావ్ అనిపించే ఫీచర్లు!
ఫోక్స్‌వ్యాగన్ మోస్ట్ అవైటెడ్ కార్ అయిన తైగున్ ప్రివ్యూను కంపెనీ హైదరాబాద్ లో నిర్వహించింది.
తన మోస్ట్ అవైటెడ్ కార్ అయిన తైగున్ ప్రివ్యూను ఫోక్స్‌వ్యాగన్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఇందులో వినియోగదారులు ఈ కార్ ను ఎక్స్ పీరియన్స్ కూడా చేయవచ్చు. ఇప్పటివరకు ఈ కార్ ప్రివ్యూ బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో జరగగా, హైదరాబాద్ నాలుగో నగరం. తర్వాత ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా, చండీఘడ్ ల్లో ఈ ప్రివ్యూ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన ఈ కార్ లాంచ్ కానుంది.
ఈ ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ సమయంలో ఆసక్తి కలిగిన వినియోగదారులు ఈ కారును ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. దీనితో పాటుగా ఇటీవలే ప్రారంభం అయిన 360 డిగ్రీ విజువలైజర్ అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. ఈ 360 డిగ్రీ విజువలైజర్‌తో తైగున్ ఫీచర్లను వినియోగదారులు సౌకర్యవంతంగా తమ ఇంటిలోనే ఉంటూ డిజిటల్‌గా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్స్‌తో చూడవచ్చు. దీంతోపాటు వినియోగదారులు తైగున్ యాక్ససరీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. తద్వారా తమ జీవనశైలి అవసరాలకు తైగున్ ఏ విధంగా సరిపోతుందనే అంశాన్ని వారు ముందుగానే తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా మాట్లాడుతూ ఫోక్స్‌వ్యాగన్‌కు దక్షిణ భారతదేశం అత్యంత ముఖ్యమైన మార్కెట్ అన్నారు. ఐటీ కేంద్రం అయిన హైదరాబాద్‌లో ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ నిర్వహించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 23వ తేదీన లాంచ్ కానుందన్నారు.
ఈ కార్‌లో చూడగానే ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్స్, డిజిటల్ కాక్‌పిట్, 40కు పైగా భద్రతా ఫీచర్లతో సహా ప్రీమియం ఇంటీరియర్స్ తో ఆకర్షణీయమైన డిజైన్ కూడా ఇందులో ఉంది. అత్యున్నత నిర్మాణ నాణ్యత, భద్రతల్లో టాప్ క్లాస్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తూ.. డ్రైవ్ చేసేటప్పుడు సరదాగా ఉండే అనుభవాన్ని ఇది అందించనుంది.
దీనిలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ఫోక్స్‌వ్యాగన్ టీఎస్‌ఐ టెక్నాలజీ ఉంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 7 స్పీడ్ డీఎస్‌జీ, 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉన్న 1. 5 లీటర్ టీఎస్‌ఐ, 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు లభించనుంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
వినియోగదారుల అనుభవాలను మెరుగు పరిచేందుకు ఫోక్స్‌వ్యాగన్ డిజిటలైజ్డ్ కార్యక్రమాల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టింది. ఇది బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకురానుంది. సర్వోత్తమ్ 2.0 కార్యక్రమం కింద 360 డిగ్రీ విజువలైజర్, టెస్ట్ డ్రైవ్ షెడ్యూలర్, సర్వీస్ క్యాం, వాట్సాప్ ఫర్ విజువలైజర్, పేపర్ లెస్ డాక్యుమెంటేషన్, కార్ హెల్త్ రిపోర్ట్ వంటి మరెన్నో కార్యక్రమాలను కంపెనీ అందిస్తోంది.
Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కారణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవకాశం!
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర రూ.14 వేలలోపే.. రియల్ మీ సూపర్ ట్యాబ్లెట్!