iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
టెక్ దిగ్గజం యాపిల్ వచ్చేవారం తన ఐఫోన్ 13 సిరీస్ ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లాంచ్ కు ముందు ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు ఆన్ లైన్ లో లీకయ్యాయి.
ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ వచ్చేవారం లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే లాంచ్ కు ముందే దీని స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు లీకయ్యాయి. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల గురించిన వివరాలను ఉక్రేనియన్ వెబ్ సైట్ లీక్ చేసింది.
ఐఫోన్ 13 స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు(అంచనా)
లీకుల ప్రకారం.. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ స్మార్ట్ ఫోన్లు 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానున్నాయి. వీటిలో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో లేదు. అయితే ఐఫోన్ 12 విషయంలో మాత్రం ఈ రెండు ఫోన్లలో కూడా యాపిల్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను అందించింది.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లలో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈసారి లాంచ్ కానున్న ఐఫోన్ టాప్ ఎండ్ వేరియంట్లలో 1 టీబీ(1024 జీబీ) వేరియంట్ కూడా ఉండనుందని వార్తలు వచ్చాయి.
ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ ఫోన్లు బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, ప్రొడక్ట్(రెడ్), వైట్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. దీన్ని బట్టి యాపిల్ కొత్తగా పింక్ కలర్ వేరియంట్ ను ఈ సంవత్సరం తీసుకురానుందని తెలుస్తోంది.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు బ్లాక్, సిల్వర్, గోల్డ్, బ్రాంజ్ రంగుల్లో లాంచ్ కానున్నాయని సమాచారం. ఐఫోన్ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్ ఫోన్లు గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయ్యాయి. వీటిలో పోలిస్తే ఐఫోన్ 13 సిరీస్ హైఎండ్ ఫోన్లు పూర్తిగా కొత్త రంగుల్లో రానున్నాయి.
సెప్టెంబర్ 14వ తేదీన యాపిల్ తన తర్వాతి ఈవెంట్ ను నిర్వహిస్తోంది. అదేరోజున ఐఫోన్ 13 సిరీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ రియల్ మీ ఫోన్ పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.6 వేల వరకు!
Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర రూ.14 వేలలోపే.. రియల్ మీ సూపర్ ట్యాబ్లెట్!
Also Read: Jio phone next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్.. కొనాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే!