Upcoming SUV 2023: న్యూ ఇయర్‌లో న్యూ వెహికిల్స్, జనవరి 2023లో లాంచ్ కాబోతున్న SUVలు ఇవే!
కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త కార్లు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. జనవరిలో లాంచ్ కాబోతున్న SUVలు ఏవో ఇప్పుడు చూద్దాం.
మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా సహా పలు కార్ల తయారీ సంస్థలు 2023లో సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. థార్ 2WD, జిమ్నీ 5-డోర్, BMW X1 సహా పలు కార్లు దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాయి. ముందుగా జనవరిలో లాంచ్ కానున్న SUVలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహీంద్రా థార్ 2WD
మహీంద్రా నుంచి థార్ 2WD విడుదలకు రెడీ అవుతోంది. కంపెనీ ఇప్పటి వరకు అధికారిక లాంచ్ డేట్ ప్రకటించపోయినా, ఈ మోడల్ జనవరి 2023 మొదటి వారంలో దేశంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. త్వరలో ఈ కారు విడుదలకు సంబంధించిన వివరాలను మహీంద్రా కంపెనీ వెల్లడించనుంది.
2. MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్
2023 హెక్టర్ SUV జనవరి 5న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. సరికొత్త హెక్టర్ కొత్త ఫీచర్లతో పాటు రీప్రొఫైల్డ్ ఎక్స్ టీరియర్స్ తో విడుదలకాబోతోంది.
3. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్
జిమ్నీ SUVకి సంబంధించి లాంగ్ వెర్షన్, వచ్చే నెలలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల కాబోతోంది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అదే రోజును లాంచ్ కానుంది. ఈ కారు త్వరలో విడుదల కాబోయే థార్ 5-డోర్ వంటి వాహనాలకు పోటీగా ఉంటుంది.
4. మహీంద్రా XUV400 EV
మహీంద్రా కంపెనీ ఇప్పటికే XUV400 EVకి సంబంధించిన వివరాలను వివరించింది. ఈ కారు జనవరిలోనే విడుదల కానుంది. ఇది టాటా నెక్సాన్ EV వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది . ధర కూడా ఇంచుమించు టాటా నెక్సాన్ EV మాదిరిగానే ఉంవచ్చు.
5. న్యూ లెక్సస్ RX SUV
కొత్త RX జనవరి 2023 నుంచి భారత్ లో అమ్మకాలను జరుపుకోనుంది. ఈ కారు జూన్ 2022లో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ కారు 2.5-లీటర్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.
6. New-gen BMW X1
New-gen X1 SUV సహా BMW ఐదు కొత్త మోడళ్లను జనవరిలో విడుదల చేయనుంది. ఎంపిక చేసిన డీలర్లు లాంచ్ కు ముందు కొత్త మోడళ్లపై ప్రీ-లాంచ్ బుకింగ్‌లను తీసుకుంటున్నాయి. 2023 జనవరి చివరి వారంలో బెంగళూరులో జరగనున్న మూడో BMW జాయ్ టౌన్ ఫెస్టివల్ లో కొత్త కార్ల ధరలను కంపెనీ ప్రకటించనుంది.
7. టాటా హారియర్ స్పెషల్ ఎడిషన్
కొత్త హారియర్ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌కు ముందే కంపెనీ డీలర్ల దగ్గరికి చేరుకుంటుంది. ఈ కొత్త మోడల్ లోపల రెడ్ హైలైట్‌లను కలిగి ఉంటుంది. హారియర్ డార్క్ ఎడిషన్ ఆధారంగా వస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Read Also: కార్లు క్రాష్ అయినప్పుడు మంటలెందుకు వస్తాయి? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?