(Source: ECI/ABP News/ABP Majha)
Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!
2023 బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి పెద్ద పీట వేశారు.
Auto Budget 2023: 2023 బడ్జెట్ ఆటో పరిశ్రమకు చాలా మద్దతుగా ఉంది. ఈ బడ్జెట్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నించింది. అసలు ఈ బడ్జెట్‌లో ఆటో మొబైల్స్ రంగంలో కోసం ప్రకటించిన విషయాలు ఏంటి?
- వెహికిల్ రీప్లేస్‌మెంట్
- కాలుష్యాన్ని పెంచే వాహనాలను మార్చడం, స్క్రాప్ చేయడం వంటివి పచ్చటి వాతావరణం కోసం అవసరం.
- పాత వాహనాలను మార్చేందుకు వీలుగా రాష్ట్రానికి సాయం అందిస్తామన్నారు.
- దీని ద్వారా పాత అంబులెన్స్‌లను కూడా మార్చనున్నారు. తద్వారా ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఆటోమొబైల్స్ మరింత చవక కానున్నాయి.
2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆటో రంగానికి సంబంధించి పెద్ద విషయాలు చెప్పారు. ఇందులో వాహన రీప్లేస్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. వాహనాల రీప్లేస్‌మెంట్‌లో పాత వాహనాలను స్క్రాప్ చేయనున్నారు. కాలుష్యాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. ఇది పచ్చటి వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.
రెండో విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేస్తుంది. తద్వారా రాష్ట్రాలు కూడా పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను వినియోగించుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో ఇది ఒక ముఖ్యమైన దశ. ఇందులో కాలుష్యాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పాత అంబులెన్స్‌ను మార్చనున్నారు. దీని నుండి చాలా ఉపశమనం ఆశించవచ్చు.
దీంతోపాటు ఆటోమొబైల్స్ ధరలు మరింత తగ్గనున్నాయని ప్రకటించారు. దీని వలన నేరుగా సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథం కనిపరిచింది. ఈ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలను రీజనబుల్‌గా ఉంచడం ద్వారా చాలా మంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
బడ్జెట్‌లో పొందు పరిచిన మరికొన్ని కీలక అంశాలు
1.రూ.ఏడు లక్షల వరకూ పన్ను మినహాయింపును పెంచారు. ఒకవేళ ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.15 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్ పడనుంది.
2 .రూ.ఏడు లక్షల ఆదాయం దాటితే, రూ.మూడు నుంచి ఆరు లక్షల వరకూ ఐదు శాతం పన్ను, రూ.ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకూ ఏడు శాతం పన్ను, రూ.తొమ్మిది నుంచి 12 లక్షల వరకూ 12 శాతం పన్ను విధించనున్నారు
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పొదుపు మొత్తం పరిమితిని రూ.15 లక్షల నుంచి ఒకేసారి ఏకంగా రూ.30 లక్షల వరకూ పెంచారు.
4. Monthly Income Account Scheme కింద ప్రస్తుతం ఉన్న రూ.4.5 లక్షల పరిమితిని కూడా ఒకేసారి రూ.9 లక్షలకు పెంచారు.
5. ఇక మహిళలకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందులో రెండేళ్ల వరకూ రూ.2 లక్షల మొత్తం వరకు పొదుపు చేసుకోవచ్చు.
6. ఇకపై కామన్ ఐడెంటిటీగా పాన్ కార్డ్‌నే పరిగణించనున్నారు. కేంద్రం విద్యుత్ రంగంలో రూ.35 వేల కోట్లు కేటాయించనుంది.
7. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 లో భాగంగా 30 స్కి ల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.