TVS iQube vs Ola S1 Air: టీవీఎస్ ఐక్యూబ్ - ఓలా ఎస్1 ఎయిర్, వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అంటే?
దేశీల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఓలా తాజాగా అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను విడుదల చేసింది. ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగింది. వీటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..
ఓలా సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. S1 ఎయిర్ పేరుతో సరసమైన ధరతో అందిస్తోంది. ఈ లేటెస్ట్ స్కూటర్ ఇప్పటికే ఉన్న వేరియంట్‌ల మాదిరిగానే కనిపిస్తున్నా, వేరే మోటార్, హార్డ్ వేర్ ను కలిగి ఉంది. TVS iQube లాంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఈ రెండు స్కూటర్లకు సంబంధించిన కంపారిజన్ ఇప్పుడు చూద్దాం..
TVS iQube vs Ola S1 Air
TVS iQube ఫ్యూచరిస్టిక్, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. హ్యాండిల్ బార్ కౌల్‌పై ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్ లైట్, LED DRLని కలిగి ఉంటుంది. iQube యొక్క సైడ్ ప్యానెల్‌లు పెద్దవిగా ఉంటాయి. TVS ఇ-స్కూటర్ కూడా సింగిల్-పీస్ రియర్ గ్రాబ్ రైల్‌ను కలిగి ఉంటుంది. S1 ఎయిర్ స్కూటర్ S1 డిజైన్ లోనే ఉంటుంది. ఇది పెరిఫెరీలో LED లైట్‌తో పాటు డబుల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్‌లతో వస్తుంది. సైడ్ ప్యానెల్స్, సీట్ డిజైన్ కూడా అలాగే కనిపిస్తుంది. Ola S1 సింగిల్-పీస్ ట్యూబ్యులర్ రియర్ గ్రాబ్ రైల్ తో ఉండగా, S1 ఎయిర్ ఫ్లాట్ ఫుట్ బోర్డ్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్లు
TVS iQube స్పోర్ట్స్ LED లైటింగ్ తో కూడాని ఐదు అంగుళాల TFT స్క్రీన్ ను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్, సైడ్ స్టాండ్ అలర్ట్, జియో-ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్, లైవ్ లొకేషన్ స్టేటస్, రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రాష్ అలర్ట్ ను కలిగి ఉంటుంది. Ola S1 ఎయిర్‌లో LED లైటింగ్ తో కూడిన ఏడు అంగుళాల TFT టచ్ స్క్రీన్ ఉంటుంది. మూడు రైడ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), CBS, సైడ్ స్టాండ్ అలర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ ప్లే బ్యాక్, OTA అప్‌డేట్స్ ఉన్నాయి. రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఉంటుంది.
బ్యాటరీ, మోటార్
TVS iQubeలో 3.4kWh బ్యాటరీతో జతచేయబడిన 3kW మోటార్ ను కలిగి ఉంటుంది. TVS iQube 100km పరిధిని అందిస్తుంది. గరిష్ట వేగం 78kmph ఉంటుంది. S1 ఎయిర్‌లో 4.5kW మోటార్ (పీక్ పవర్), 2.5kWh బ్యాటరీని కలిగి ఉంది. Ola ఇ-స్కూటర్ 76 కిమీ పరిధితో పాటు గరిష్ట వేగం 85kmphగా ఉంటుంది.
హార్డ్ వేర్
రెండు స్కూటర్లు టెలి స్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లపై నడుస్తాయి. TVS iQube ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ ను కలిగి ఉంది. S1 ఎయిర్ రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. రెండు EVలు ఒకే పరిమాణంలో ఉన్న వీల్స్, టైర్లను కలిగి ఉంటాయి.
ధర ఎంతంటే?
TVS iQube ధర రూ. 1.12 లక్షలు (ఆన్-రోడ్ బెంగళూరు) కాగా, Ola S1 ఎయిర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు)గా ఫిక్స్ చేయబడ్డాయి.
Read Also: నెల రోజుల్లోనే 76,000 మారుతి గ్రాండ్ విటారా SUVల బుకింగ్, 13 వేల యూనిట్ల డిస్పాచ్!