అన్వేషించండి

Maruti Grand Vitara: నెల రోజుల్లోనే 76,000 మారుతి గ్రాండ్ విటారా SUVల బుకింగ్, 13 వేల యూనిట్ల డిస్పాచ్!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUVల బుకింగ్‌ జోరందుకుంది. సుమారు నెల రోజుల వ్యవధిలో 76 వేల యూనిట్ల బుకింగ్స్ నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 13 వేల యూనిట్లను డీలర్లకు పంపింనట్లు కంపెనీ తెలిపింది.

దేశీయ వాహన తయారీ సంస్ధ మారుతీ సుజుకి అక్టోబర్ 2022 నెలలో యోవై (ఇయర్-ఆన్-ఇయర్) అమ్మకాల్లో పెరుగుదలను సాధించింది. కంపెనీ అక్టోబర్ 2022లో 1,67,520 యూనిట్లను రిటైల్ చేయగలిగింది. గత ఏడాది ఇదే సమయంలోని అమ్మకాలతో పోల్చితే అమ్మకాల్లో 21% వృద్ధి నమోదు అయ్యింది. కంపెనీ అక్టోబర్ 2021లో 138,335 యూనిట్లను విక్రయించింది. గత నెల దేశీయ మార్కెట్‌లో మొత్తం అమ్మకాలలో 1,43,250 యూనిట్లు విక్రయించగా, 3,822 యూనిట్లు ఇతర OEMలకు రిటైల్ చేయబడ్డాయి. మిగతా 20,448 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. సెమీ కండక్టర్ల కొరత  ప్రధానంగా దేశీయ మోడళ్ల వాహనాల ఉత్పత్తిని స్వల్పంగా ప్రభావితం చేసిందని కంపెనీ వెల్లడించింది.  అయితే, ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు మారుతి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

5 వారాల్లో 76 వేల గ్రాండ్ విటారా SUVల బుకింగ్స్

అటు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ కీలక విషయాలను వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన గ్రాండ్ విటారా SUVకి సంబంధించిన బుకింగ్‌లు, డిస్పాచ్ వివరాలను తెలిపారు. నవంబర్ 2 వరకు కొత్త SUV కోసం 76,000 బుకింగ్‌లను అందుకున్నట్లు చెప్పారు. వాటిలో కంపెనీ ఇప్పటికే 13,000 యూనిట్లను డీలర్‌ షిప్‌ లకు పంపిందని మారుతీ బాస్‌ మన్ తెలిపారు."సెప్టెంబర్ చివరి వారంలో మేము ఈ కారు బుకింగ్స్ ప్రారంభించాము. గత ఐదు వారాల్లో బుకింగ్ సంఖ్య 76,000 మార్కును దాటింది. మేము ఇప్పటికే 13,000 యూనిట్లను పంపించాము. గ్రాండ్ విటారా SUVకి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది" అని శ్రీవాస్తవ చెప్పారు.

భారీగా సరికొత్త బ్రెజ్జా ఎస్‌యూవీ బుకింగ్స్

శ్రీవాస్తవ సరికొత్త బ్రెజ్జా ఎస్‌యూవీ గురించి కూడా పలు విషయాలు తెలిపారు.  సబ్-కాంపాక్ట్ SUV కోసం మారుతీకి మంచి ఇన్‌ ఫ్లో బుకింగ్‌లు వస్తున్నాయని చెప్పారు. "బ్రెజ్జాకు సంబంధించి, మేము మంచి ఇన్ ఫ్లో బుకింగ్‌లను పొందుతున్నాము.  ప్రతి నెలా సుమారు 15,000 యూనిట్ల బ్రెజ్జాను ఉత్పత్తి చేస్తున్నాము.  బ్రెజ్జా ఇప్పుడు దేశంలో అగ్రగామి SUV కావడానికి కారణం.. మేము నెలకు దాదాపు 25,000 తాజా బుకింగ్‌లను పొందడం. కొత్త బ్రెజ్జాకు కూడా మంచి ట్రెండింగ్ లో కొనసాగుతుంది" అని శ్రీవాస్తవ  తెలిపారు. 

XL6, బాలెనో CNG కార్ల లాంచ్

అటు మారుతి హైబ్రిడ్, మిల్-హైబ్రిడ్ మోడళ్లను అందుబాటులోకి తేవడంతో పాటు దాని CNG పరిధిని రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ విస్తరణ మారుతి సుజుకి ప్రీమియం నెక్సా శ్రేణికి కూడా చేరుకుంది. ఈ కంపెనీ అమర్చిన CNG కార్లు చాలా సురక్షితమైనవి కావడంతో పాటు ఆఫ్టర్‌ మార్కెట్‌ లో ఉపయోగించడం ఈజీగా ఉంటుంది. అందులో భాగంగానే  బాలెనో, XL6 CNG మోడల్స్ తాజాగా లాంచ్ అయ్యాయి. ఈ లేటెస్ట్ కార్లపెట్రోల్ వెర్షన్‌లతో పోల్చితే CNG వెర్షన్ ధర రూ. 95,000 ఎక్కువ. బాలెనో  డెల్టా, జీటా ట్రిమ్‌లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్నది. అయితే XL6 CNG జీటా ట్రిమ్‌లో మాత్రమే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బాలెనో సిఎన్‌జికి ఎటువంటి పోటీ లేదు. ఎందుకంటే, మరే ఇతర ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్  సిఎన్‌జి ఎంపికతో రావడవ లేదు. సిఎన్‌జి పంపులు లేకపోవడం,  ఎక్కువ సేపు వేచి ఉండటమే సమస్యగా చెప్పుకోవచ్చు. ఫ్యాక్టరీకి  ఫిట్టింగ్  CNG కారు పెట్రోల్‌ కారుతో పోల్చితే మరింత ప్రాక్టికల్ గా ఉంటుంది.  అయితే XL6 అనేది ఎఫిసియెంట్ ఫ్యామిలీ  MPV రకాలుగా కూడా అప్పీల్ చేస్తుంది.

Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget