TVS iQube ST: టీవీఎస్ ఐక్యూబ్‌లో కొత్త మోడల్ - ఏకంగా 150 కిలోమీటర్ల రేంజ్‌తో!
TVS iQube New Variants: టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో కొత్త మోడల్స్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది.
TVS iQube New Models: టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఐక్యూబ్ ఎస్‌టీ స్కూటర్‌ను విడుదల చేశారు. ఈ స్కూటర్ లాంచ్‌తో పాటు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ డెలివరీ త్వరలో ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మూడు బ్యాటరీ ప్యాక్‌లతో భారత మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 2.2 కేడబ్ల్యూహెచ్ యూనిట్, 3.4 కేడబ్ల్యూహెచ్ యూనిట్, 5.1 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ఉన్నాయి. వీటితో పాటు ఈ స్కూటర్ ఇప్పుడు ఐదు వేరియంట్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధర రూ.85 వేల నుంచి మొదలై రూ.1.38 లక్షల వరకు ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
టీవీఎస్ ఐక్యూబ్ ఎంట్రీ లెవల్ మోడల్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లోకి వస్తోంది. ఈ స్కూటర్‌లో 2.2 కేడబ్ల్యూహెచ్, 3.4 కేడబ్ల్యూహెచ్ ఆప్షన్లు ఉన్నాయి. దీని 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 4.4 కేడబ్ల్యూ శక్తిని అందిస్తుంది. 140 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన స్కూటర్ 100 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,03,422గా ఉంది. 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,26,007గా నిర్ణయించారు. వివిధ ప్రాంతాలకు అనుగుణంగా ఈ ధరలో మార్పులు ఉండవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ (TVS iQube S)
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్... 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో భారతీయ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ టీవీఎస్ స్కూటర్‌లో 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. ఇందులో రెండు హెల్మెట్‌లను ఒకేసారి ఉంచుకోవచ్చు. ఈ స్కూటర్‌లో 17.78 సెంటీమీటర్ల TFT డిస్‌ప్లే కూడా అందించారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ కేవలం 4.2 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలేదు. ఢిల్లీలో ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,39,451గా ఉంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ (TVS iQube ST)
3.4 కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 17.78 సెంటీమీటర్ల టీఎఫ్‌టీ టచ్ డిస్‌ప్లే ఉంది. దీనిలో మీరు సంగీతాన్ని ఆన్, ఆఫ్ చేసే ఎంపికను కూడా పొందుతారు. అలాగే మీ ఫోన్‌లో ఇన్‌కమింగ్ కాల్‌ల గురించి సమాచారాన్ని కూడా పొందుతారు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీలో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 100 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఢిల్లీలో ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,51,051గా ఉంది. అయితే 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌లో 150 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఈ బ్యాటరీ ఉన్న స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,98,408గా నిర్ణయించారు.
Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు