TVS తొలి అడ్వెంచర్ బైక్ Apache RTX - వాస్తవ ప్రపంచంలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
TVS తొలి అడ్వెంచర్ బైక్ Apache RTX పెర్ఫార్మెన్స్ టెస్టుల్లో ఎలా నిలిచింది? యాక్సిలరేషన్, రోల్-ఆన్, బ్రేకింగ్ ఫలితాలు, ధర వివరాలను ఇక్కడే సింపుల్‌గా తెలుసుకోండి.

TVS Apache RTX Review: టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి వచ్చిన తొలి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ TVS Apache RTX ఇప్పటికే బైక్ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది. MotoSoul 2024లో పరిచయం చేసిన కొత్త RT-XD4 ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించారు. ఇప్పుడు ఈ RTX రోడ్డుపై నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు చేసిన పెర్ఫార్మెన్స్ టెస్టుల పూర్తి వివరాలు ఇవిగో...
యాక్సిలరేషన్ ఎలా ఉంది?
Apache RTX యాక్సిలరేషన్ టెస్టులను చలికాలంలో, పొడి రోడ్డుపై నిర్వహించారు. క్లీన్‌గా స్టార్ట్ కావడానికి ట్రాక్షన్ కంట్రోల్‌ను ఆఫ్ చేశారు. మొదటి నుంచే బైక్ మంచి పికప్ చూపించింది. టైర్లు సరిపడా గ్రిప్ ఇచ్చాయి.
0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి ఈ మోటార్‌సైకిల్‌కి 3.41 సెకన్లు పట్టింది. 0-80 కిలోమీటర్ల వేగాన్ని 5.23 సెకన్లలో, 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.95 సెకన్లలో అందుకుంది. ఇవి అడ్వెంచర్ సెగ్మెంట్‌లో మంచి నంబర్లుగా అని చెప్పాలి.
క్రూజింగ్‌లో క్విక్‌షిఫ్టర్ బాగా పనిచేసినా, ఫాస్ట్ టైమ్ కోసం ఎక్స్‌పర్ట్‌లు దాన్ని ఆఫ్ చేశారు. క్లచ్ ఆపరేషన్ తేలికగా ఉంది. గేర్ మార్పులు స్మూత్‌గా జరిగాయి. ఈ టెస్ట్ మొత్తం Rally మోడ్‌లో నిర్వహించారు.
రోల్-ఆన్ యాక్సిలరేషన్
Apache RTXలో ఉన్న 299.1cc సింగిల్ సిలిండర్ RT-XD4 ఇంజిన్ 9,000rpm వద్ద 36hp, 7,000rpm వద్ద 28.5Nm టార్క్ ఇస్తుంది. గేర్‌లోనే వేగం పెంచే రోల్-ఆన్ టెస్టుల్లో కూడా ఈ బైక్ మంచి ఫలితాలు చూపించింది.
2వ గేర్‌లో 20 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని 2.25 సెకన్లలో,
3వ గేర్‌లో 30 నుంచి 70 కిలోమీటర్లు 3.89 సెకన్లలో,
4వ గేర్‌లో 50 నుంచి 80 కిలోమీటర్లు 3.83 సెకన్లలో చేరుకుంది.
మిడ్‌రేంజ్ పవర్ బలంగా ఉండటంతో ఓవర్‌టేకింగ్ సులభంగా అనిపిస్తుంది. హై రేవ్స్ వద్ద ఫుట్‌పెగ్స్ వద్ద కొద్దిగా వైబ్రేషన్స్ అనిపించినా, రైడింగ్ అనుభవాన్ని పాడు చేసే స్థాయిలో మాత్రం లేవు.
బ్రేకింగ్ పనితీరు
Apache RTX బ్రేకింగ్ చాలా షార్ప్‌గా అనిపించకపోయినప్పటికీ నమ్మకంగా పని చేసింది. 60 నుంచి 0 కిలోమీటర్ల వేగానికి తగ్గడానికి ఈ బైక్‌కు 17.19 మీటర్లు పట్టింది.
హార్డ్ లేదా ఎమర్జెన్సీ బ్రేకింగ్‌లో ABS కొంచెం ఇన్‌ట్రూసివ్‌గా అనిపిస్తుంది. ఎంచుకున్న రైడింగ్ మోడ్‌ను బట్టి ABS పని విధానం మారుతుంది. ఈ ఫలితం Rally మోడ్‌లో వచ్చినది. Tour మోడ్‌లో బ్రేక్‌లు వేసినప్పుడు ABS మరింత జోక్యం చేసుకున్నట్లు అనిపించింది.
ధర, వేరియంట్లు
TVS Apache RTX ప్రారంభ ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
Base వేరియంట్ – రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Top వేరియంట్ – రూ.2.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)
BTO (Built To Order) – రూ.2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Base వేరియంట్‌లో క్విక్‌షిఫ్టర్ ఉండదు. అలాగే ప్రత్యేకమైన Viper Green కలర్ స్కీమ్ కేవలం BTO వేరియంట్‌కే అందుబాటులో ఉంది.
TVS Apache RTX, పెర్ఫార్మెన్స్ పరంగా అడ్వెంచర్ బైక్ ప్రేమికులను నిరాశపరచదు. శక్తిమంతమైన ఇంజిన్, మంచి యాక్సిలరేషన్, నమ్మదగిన బ్రేకింగ్‌తో ఇది రోజువారీ రైడ్స్‌కు, అడ్వెంచర్ ట్రిప్స్‌కూ సరైన ఎంపికగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















