అన్వేషించండి

ఇండియా బైక్‌ వీక్‌ 2025లో SMK నుంచి సరికొత్త హెల్మెట్‌ - యూరోపియన్‌ స్టాండర్డ్‌ జాకెట్లు కూడా

SMK Helmets, ఇండియా బైక్‌ వీక్‌ 2025లో సైగ్నస్‌ ఫ్లిప్‌బ్యాక్‌, డెల్టా సిరీస్‌ హెల్మెట్లు & యూరోపియన్‌ స్టాండర్డ్‌ రైడింగ్‌ జాకెట్లతో ప్రీమియం రేంజ్‌ను ఆవిష్కరించింది.

SMK Helmets India: భారత మార్కెట్‌లో ప్రీమియం బైక్‌లు, అడ్వెంచర్‌ టూరింగ్‌, లాంగ్‌ రైడ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో, రైడర్ల భద్రతపై దృష్టి పెట్టిన బ్రాండ్లకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టడ్స్‌ యాక్సెసరీస్‌ లిమిటెడ్‌ (Studds Accessories Ltd)కు చెందిన ప్రీమియం బ్రాండ్‌ ఎంఎస్‌కే హెల్మెట్స్‌ (SMK Helmets)… ఇండియా బైక్‌ వీక్‌ 2025 (India Bike Week) వేదికగా తన కొత్త ప్రీమియం ప్రొడక్ట్‌ రేంజ్‌ను ఆవిష్కరించింది.

ప్రధాన ఆకర్షణ ఇదే...
ఈ లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది SMK సైగ్నస్‌ ఫ్లిప్‌బ్యాక్‌ హెల్మెట్‌ ‍‌(Cygnus flip-back helmet). ఇది 180 డిగ్రీల వరకు తిరిగే చిన్‌బార్‌తో వస్తుంది. అంటే, అవసరాన్ని బట్టి ఫుల్‌ఫేస్‌ హెల్మెట్‌గా లేదా ఓపెన్‌ఫేస్‌ హెల్మెట్‌గా వాడుకునే అవకాశం ఉంటుంది. క్రూయిజర్‌ బైక్‌పై నిటారుగా కూర్చుని రైడ్‌ చేసేవారికి, స్పోర్ట్స్‌ బైక్‌పై ముందుకు వంగి రైడ్‌ చేసేవారికి – ఇద్దరికీ సరిపోయేలా దీనిని డిజైన్‌ చేశారు.

P/J సర్టిఫికేషన్‌ 
భారతదేశంలో చాలా కొన్ని హెల్మెట్లకే ఉన్న "P/J సర్టిఫికేషన్‌" సైగ్నస్‌కు ఉండటం విశేషం. ఈ హెల్మెట్‌లో.. ఎనర్జీ ఇంపాక్ట్‌ రెసిస్టెట్‌ థెర్మోప్లాస్టిక్‌ (EIRT) షెల్‌, మల్టీ డెన్సిటీ EPS లైనర్‌ ఉండటంతో ప్రమాదాల సమయంలో మెరుగైన రక్షణ లభిస్తుంది. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ వైడ్‌ వైజర్‌, పిన్‌లాక్‌ మాక్స్‌విజన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ సన్‌వైజర్‌, ప్రీమియం వెంటిలేషన్‌ సిస్టమ్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.

వేరియంట్లు - ధర 
సైగ్నస్‌ హెల్మెట్‌ నాలుగు రంగుల్లో, ఐదు సాలిడ్‌ వేరియంట్లలో, రెండు షెల్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. XS నుంచి XXXL వరకు సైజ్‌లు ఉంటాయి. పూర్తి స్థాయి మార్కెట్‌ లాంచ్‌ తర్వాత, దీని ధర రూ.17,000 నుంచి రూ.20,000 మధ్య ఉండవచ్చు.

మరికొన్ని హెల్మెట్లు
ఇదే ఈవెంట్‌లో SMK Ares & SMK Nova మోడళ్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ హెల్మెట్లు ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. Ares మోడల్‌లో డిటాచబుల్‌ సన్‌పీక్‌, ఇంటర్నల్‌ సన్‌వైజర్‌ ఉంటాయి. Nova మోడల్‌ మాత్రం కళ్లద్దాలు వాడే రైడర్లకు అనువుగా డిజైన్‌ చేశారు. వీటిలో అల్ట్రా వైడ్‌ ఫీల్డ్‌ ఆఫ్‌ విజన్‌ ఉంటుంది. Ares ధర రూ.6,350 నుంచి, Nova ధర రూ.3,900 నుంచి ప్రారంభమవుతుంది.

డెల్టా సిరీస్‌ ద్వారా SMK డెమీ-జెట్‌ హెల్మెట్‌ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది. Delta City మోడల్‌ను నగర ప్రయాణికుల కోసం రూపొందించారు. తక్కువ బరువు గల EIRT షెల్‌, క్లియర్‌ వైజర్‌, క్విక్‌ రిలీజ్‌ బకిల్‌, మాయిశ్చర్‌ను తక్కువగా నిల్వ చేసే ఇంటీరియర్‌ ఇందులో ఉన్నాయి. Delta Tour మోడల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ రైడర్లకు ఉపయోగపడేలా డ్యూయల్‌ ఎక్స్‌టర్నల్‌ వైజర్లు, కంఫర్ట్‌ చీక్‌ ప్యాడ్స్‌, బ్లూటూత్‌ స్పీకర్‌ పాకెట్లు కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ధర రూ.3,299 నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త రైడింగ్‌ జాకెట్లు
హెల్మెట్లతో పాటు యూరోపియన్‌ CE Level A సర్టిఫికేషన్‌ పొందిన రైడింగ్‌ జాకెట్లను కూడా SMK ప్రదర్శించింది. వేసవికి అనువైన Infinity Rush, Gladiator జాకెట్లు... 600D ఆక్స్‌ఫర్డ్‌ ఫ్యాబ్రిక్‌, మెష్‌ ప్యానెల్స్‌, రిమూవబుల్‌ వాటర్‌ప్రూఫ్‌ లైనర్లతో వస్తాయి. టూరింగ్‌, చలికాలానికి సరిపోయే Apex Adventura జాకెట్‌.... త్రీ-క్వార్టర్‌ లెంగ్త్‌, థర్మల్‌ లైనర్‌, రిఫ్లెక్టివ్‌ ప్యానెల్స్‌, హైడ్రేషన్‌ ప్యాక్‌ సిస్టమ్‌తో అందుబాటులో ఉంటుంది. మహిళా రైడర్ల కోసం Athenova జాకెట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జాకెట్లు S నుంచి 4XL వరకు సైజ్‌లలో వస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్న స్టడ్స్‌ యాక్సెసరీస్‌… 2024లో ప్రపంచంలోనే అతి పెద్ద హెల్మెట్‌ తయారీ కంపెనీగా నిలిచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget