అన్వేషించండి

నియో రెట్రో స్టైల్‌లో స్పోర్ట్స్‌ బైక్‌ ఫీల్‌! Yamaha XSR 155 అసలు బలం ఇదే

యమహా XSR 155 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో స్పీడ్‌, రోల్‌ ఆన్‌, బ్రేకింగ్‌ వివరాలు ఇక్కడే తెలుసుకోండి. R15, MT 15 ఇంజిన్‌తో నియో రెట్రో లుక్‌లో ఈ బైక్‌ ఎంత శక్తిమంతమైనదో అర్ధం చేసుకోండి.

Yamaha XSR 155 Performance: భారత మార్కెట్‌లో నియో రెట్రో స్టైల్‌ మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ ట్రెండ్‌ను బాగా ఉపయోగించుకుంటూ, యమహా తీసుకొచ్చిన బైక్‌ XSR 155. బయటకు చూస్తే పాత కాలం స్టైల్‌ గుర్తొచ్చేలా కనిపించినా, లోపల మాత్రం ఇది పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో రూపొందింది. యమహా R15, MT 15 తరహాలో ఒకే చాసిస్‌, ఒకే ఇంజిన్‌ను పంచుకునే ఈ బైక్‌ పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉందంటే...

యమహా XSR 155 యాక్సిలరేషన్‌

ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌ సమయంలో రోడ్డు పరిస్థితులు పూర్తిగా పొడిగా ఉన్నాయి. మంచి లాంచ్‌ కోసం ట్రాక్షన్‌ కంట్రోల్‌ను ఆఫ్‌ చేసి పరీక్షించారు. ఫలితాల్లో ఈ బైక్‌ నిజంగా ఆకట్టుకుంది.

XSR 155 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని 4.29 సెకన్లలో, 0 నుంచి 80 కి.మీ. వేగాన్ని 7.02 సెకన్లలో, 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 11.66 సెకన్లలో చేరుకుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది చాలా మంచి సంఖ్యలు. ముఖ్యంగా మిడ్‌ రేంజ్‌లో బైక్‌ బలంగా లాగుతుంది. రెడ్‌లైన్‌ వరకు రేవ్‌ చేస్తే వచ్చే ఎగ్జాస్ట్‌ సౌండ్‌ రైడింగ్‌ను మరింత ఎంగేజింగ్‌గా చేస్తుంది. క్లచ్‌ యాక్షన్‌ లైట్‌గా ఉండటం, గేర్‌బాక్స్‌ స్మూత్‌గా పని చేయడం వల్ల సిటీతో పాటు హైవేలో కూడా బైక్‌ సులభంగా నడుస్తుంది.

రోల్‌ ఆన్‌ యాక్సిలరేషన్‌

ఈ బైక్‌లో ఉన్న 155 సీసీ, సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 10,000 ఆర్‌పీఎం వద్ద 18.4 హెచ్‌పీ పవర్‌, 7,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్ఎం టార్క్‌ ఇస్తుంది.

రోల్‌ ఆన్‌ టెస్టుల్లో రెండో గేర్‌లో 3.00 సెకన్లు, మూడో గేర్‌లో 5.73 సెకన్లు, నాలుగో గేర్‌లో 5.70 సెకన్లు పట్టింది. కేవలం 137 కిలోల కర్బ్‌ వెయిట్‌ ఉండటంతో ఈ బైక్‌ R15, MT 15తో పోలిస్తే తేలికగా అనిపిస్తుంది. అదే దీనికి మంచి పికప్‌కు కారణం.

బ్రేకింగ్‌ పనితీరు

బైక్‌ ఆపే సమయంలో స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో XSR 155 నమ్మకాన్ని కలిగిస్తుంది. ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు, డ్యూయల్‌ ఛానల్‌ ABS అందిస్తున్నారు. మా బ్రేకింగ్‌ టెస్ట్‌లో బైక్‌ తక్కువ దూరంలోనే కంట్రోల్‌లో ఆగింది. టైర్ల నుంచి వచ్చే గ్రిప్‌ సరిపడగా ఉంది. లీవర్‌ను గట్టిగా నొక్కినా ABS జోక్యం ఎక్కువగా అనిపించదు. మొత్తం మీద బ్రేకింగ్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంది.

స్పెసిఫికేషన్స్‌, ధర

యమహా, XSR 155 లో కూడా MT 15, R15 ఇచ్చే శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌నే నియో రెట్రో స్టైల్‌లో అందిస్తోంది. 155 సీసీ ఇంజిన్‌, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, 10 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, 137 కిలోల బరువు దీని ముఖ్య లక్షణాలు.

ఈ బైక్‌ ధర రూ.1,49,990 (ఎక్స్‌-షోరూమ్‌ ధర). MT 15, R15 కంటే ఇది కొంచెం చౌక. TFT స్క్రీన్‌ లేకపోయినా, ట్రాక్షన్‌ కంట్రోల్‌ స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అదనంగా, బైక్‌ను వ్యక్తిగతంగా మార్చుకునేందుకు రెండు కస్టమ్‌ కిట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. స్టైల్‌తో పాటు స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌ కోరుకునే యువ రైడర్లకు యమహా XSR 155 మంచి ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget